Share News

ముగిసిన నామినేషన్ల పర్వం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:26 PM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గురువారంతో నామినేషన్లు కార్యక్రమం ముగిసింది. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్లు కార్యక్రమం ఆదివారం మినహా యిస్తే ఏడు రోజులపాటు సాగింది.

ముగిసిన నామినేషన్ల పర్వం

ఎంపీ స్థానానికి 23.. అసెంబ్లీ స్థానాలకు 207 నామినేషన్లు

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 25: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గురువారంతో నామినేషన్లు కార్యక్రమం ముగిసింది. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్లు కార్యక్రమం ఆదివారం మినహా యిస్తే ఏడు రోజులపాటు సాగింది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలిస్తారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లను ఉపసంహరించు కోవచ్చు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ జరగనుంది. కాగా గురువారం జిల్లాలో మొత్తం 77 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 8 మంది, 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి 69 మంది తమ నామినేషన్లును రిటర్నింగ్‌ అధికారులకు దాఖలు చేశారు. జిల్లాలో నామినేషన్ల పర్వం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి 23 నామినేషన్లు, ఏడు అసెంబ్లీ నియో జకవర్గాలకు సంబంఽఽధించి 128 మంది అభ్యర్థులు 207 నామినేషన్లు దాఖలు చేశారు.

గురువారం నాటి నామినేషన్ల వివరాలు..

ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా కావూరి లావణ్య, పర్వతనేని చైతన్యకుమారి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుట్టా మహేష్‌కుమార్‌, వైసీపీ అభ్యర్థులుగా కారుమూరి సునీల్‌ కుమార్‌, వల్లూరు కీర్తి, భారతీయ జవాన్‌ కిసాన్‌ పార్టీ అభ్యర్థిగా కొండ్రు రాజేశ్వరరావు, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా కండవల్లి జీవ దేవ దయాకర్‌, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బోడె అజయ్‌బాబు నామినేషన్లు దాఖలు చేశారు.

ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన పార్టీ అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు, వైసీపీ అభ్యర్థిగా పుప్పాల శ్రీనివాసరావు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా పెద్దపూడి ధర్మరాజు, ఇండియన్‌ లేబర్‌ పార్టీ అఽభ్యర్థిగా కనికెల్లి మురళీకృష్ణ, స్వతంత్ర అభ్యర్థులుగా పత్సమట్ల భీమరాజు, పుప్పాల శ్రీనివాసరావు, బాతు నాగేశ్వరరావు, పుట్టా కుమార్‌, నల్లమిల్లి శంకరరావు నామినేషన్లు దాఖలు చేశారు.

దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా ఆలపాటి నరసింహమూర్తి , ఆలపాటి రేవతి వెంకటచౌదరి, స్వతంత్ర అభ్యర్థులుగా ముళ్ళపూడి అశోక్‌కుమార్‌, చౌదరి, పల్లి రమేష్‌, అలగా రవికుమార్‌, పేరిశెట్టి శివ నగరం ప్రసాద్‌, కొనకళ్ళ శ్రీనివాసరావు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా చిలుకూరి ప్రభాకరరావు నామినేషన్లు దాఖలు చేశారు.

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బడేటి మీనా, సీపీఐ అభ్యర్థిగా ఉప్పులూరి హేమశంకర్‌, రాడికల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా మత్తేబాబీ, బీఎస్పీ అభ్యర్థిగా అందుగుల రతన్‌ కాంత్‌, స్వతంత్ర అభ్యర్థులుగా పోలిశెట్టి తులసీ రామ్‌, మచ్చా పేద ముసల నాయుడు, నల్లమిల్లి ప్రసన్నకుమార్‌, రాజనాల శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు.

పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా కాకా కృష్ణ, బాడిస బొజ్జిదొర, మొడియం శ్రీనివాసరావు, సిరియం సూరమ్మ, సోదెం ముక్కయ్య, బొరగం రాధ, ముచిక రంజిత్‌ కుమార్‌ అప్పలరాజు దొర, కర్రేదుల హేమమాలిని, బీఎస్పీ అభ్య ర్థిగా మడకం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ అభ్యర్థులుగా దువ్వెల ప్రవీణ్‌కుమార్‌, సున్నం ప్రియాంక, జనసేన పార్టీ అభ్యర్థిగా చిర్రి బాలరాజు, భరత్‌ ఆదివాసీ పార్టీ అభ్యర్థిగా మొడియం శ్రీనివాస రావు, నవరంగ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బంధం బాలరాజు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా బాలరాజు నామినేషన్లు వేశారు.

చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థిగా సొంగా ఇసాక్‌ రాజ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా ఉన్నమట్ల రాకాడ ఎలీజా, ఉన్నమట్ల జీవన్‌ప్రభాకర్‌ కుమార్‌, వైసీపీ అభ్యర్థిగా కంభం విజయరాజు, స్వతంత్ర అభ్యర్థిగా తొర్లపాటి శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు.

నూజివీడు నుంచి టీడీపీ అభ్యర్థులుగా కొలుసు పార్ధసారఽథి, కొలురు నితిన్‌కుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరీదు కృష్ణ, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా సోము వెంకట శివ పూర్ణంద్రరావు, స్వతం త్ర అభ్యర్థులుగా మందలపు శ్రీనివాసరావు, కొలుసు కమల లక్ష్మి, దురిశెట్టి అశోక్‌కుమార్‌, ఆముదాల ఇసాకు నామినేషన్లు వేశారు.

కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా కామినేని మనోరమ, జైభీమ్‌రావు భారత్‌ పార్టీ అభ్యర్థిగా గొంతుపులుగు సతీష్‌కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి బొడ్డు నోబుల్‌, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి లావేటి వీర శివాజీ, వైసీపీ నుంచి తిరు వీధుల శారద, స్వతంత్రులుగా బొడ్డు కిరణ్‌కుమార్‌, చెన్నంశెట్టి సోమసుందరరావు, కొప్పుల విజయబాబు, బలే గణేశ్‌, మాదాసు సత్యనారాయణ, తిరువీధుల శారద, బడుగు సీతా మహాలక్ష్మి, ఏ సోమేశ్వరరావు, బడుగు భాస్కరరావు నామినేషన్లు వేశారు.

Updated Date - Apr 25 , 2024 | 11:26 PM