Share News

నామినేషన్ల వరద

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:22 AM

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ఆరో రోజుకు చేరింది. నరసాపురం ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి ఆనంద్‌ చందూలాల్‌ జాస్తి నామినేషన్‌ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటి వరకు 15 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఇక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం 35 మంది అభ్యర్థులు 41 సెట్లు దాఖలు చేశారు.

నామినేషన్ల వరద

పార్లమెంట్‌కు ఒకరు.. అసెంబ్లీ నియోజకవర్గాలకు 35 మంది దాఖలు

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 24 : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ఆరో రోజుకు చేరింది. నరసాపురం ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి ఆనంద్‌ చందూలాల్‌ జాస్తి నామినేషన్‌ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటి వరకు 15 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఇక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం 35 మంది అభ్యర్థులు 41 సెట్లు దాఖలు చేశారు.

నరసాపురం.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కానూరి ఉదయ భాస్కర్‌కృష్ణప్రసాద్‌, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా ఆకుల వెంకటస్వామి, జై భీంరావ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థిగా పోతురాజు యాకోబు, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా బందెల రాజేంద్రప్రసాద్‌, స్వతంత్ర అభ్యర్థిగా కంచన రమేష్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

తణుకు. నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థులుగా కోడూరి మెహర్‌ చైతన్య, రాపాటి రమణబాబు, కరుటూరి సుబ్బా రావు, చిట్టూరి సత్యనారాయణ, జై భీం రావ్‌ భారత్‌ పార్టీ తరఫున సాకా సురేష్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

పాలకొల్లు.. వైసీపీ అభ్యర్థులుగా గుడాల శ్రీహరి గోపాలరావు, గుడాల మంగతాయారు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నిమ్మల సూర్యకుమారి, స్వతంత్ర అభ్యర్థిగా తమ్మా భూషణం నామినేషన్లు దాఖలు చేశారు.

తాడేపల్లిగూడెం.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మార్నిడి శేఖర్‌ (బాబ్జి), రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి మరపట్ల రాజు, స్వతంత్ర అభ్యర్థి సిరివరపు సింహాచలం, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి మేకా వెంకటేశ్వరరావు రెండో సెట్‌, జనసేన అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్‌ రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

ఆచంటలో జై భీం రావ్‌ పార్టీ అభ్యర్థిగా కాకి శ్యామ్‌ కుమార్‌, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక అభ్యర్థిగా అల్లాడి సూర్యభాస్కరరావు, టీడీపీ అభ్యర్ధి పితాని సత్యనా రాయణ ఒక సెట్‌, ఆయన తనయుడు వెంకట సురేష్‌ రెండు సెట్లు నామినేషన్‌లు దాఖలు చేశారు.

ఉండిలో అఖిల భారత జన సంఘ పార్టీ అభ్యర్థిగా ముదుండి రవివర్మ, స్వతంత్ర అభ్యర్థులుగా దిడ్ల ప్రేమ్‌కుమార్‌, ఇందుకూరి నవీన్‌వర్మరాజు, వేగేశ్న సూర్యనారాయణరాజు, గాజుల శివ, తోటకూర సుధీర్‌వర్మ, నీతి నిజాయితీ పార్టీ అభ్యర్థిగా పెనుమత్స శివరామరాజు, బహుజన పార్టీ అభ్యర్థిగా మల్లిపూడి షర్మిల, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్టీ అభ్యర్థిగా అల్లూరి సతీష్‌చంద్రకుమార్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 12:22 AM