Share News

ఎంపీకి మూడు.. ఎమ్మెల్యేలకు 26

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:40 AM

జిల్లాలో ఐదో రోజు మంగళవారం మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి 3, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 26 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఎంపీకి మూడు.. ఎమ్మెల్యేలకు 26

జిల్లాలో ఐదోరోజు 29 నామినేషన్లు దాఖలు

ఏలూరు సిటీ/ఏలూరు కలెక్టరేట్‌/ఉంగుటూరు/దెందులూరు/ ఏలూరు టూ టౌన్‌/ బుట్టాయగూడెం/చింతలపూడి/ నూజివీడు/ ఏప్రిల్‌ 23 : జిల్లాలో ఐదో రోజు మంగళవారం మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి 3, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 26 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి వైసీపీ తరపున అభ్యర్ధులుగా కారుమూరి సునీల్‌కుమార్‌, వెల్లూరు కీర్తిలు, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా నిట్టా అఖిల ధరణీపాల్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి కూటమి జనసేన అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు, వైసీపీ అభ్యర్థిగా పుప్పాల శ్రీనివాసరావు, పుప్పాల ఆదివల్లి రమణి (వైసీపీ) డమ్మీ అభ్యర్థిగా తమ నామినేషన్లు ఆర్వో ఖాజావలికి అందజేశారు. ఇండియన్‌ లేబర్‌ పార్టీ అభ్యర్థిగా కనికెళ్ళ మురళీ కృష్ణ, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా బుంగా ఏసు, స్వతంత్ర అభ్యర్థిగా నాగం రాంబాబు నామినేషన్లు దాఖలు చేశారు. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీప తరపున అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా ఆముదాలపల్లి ప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఇండియా కూటమి పక్షాలైన సీపీఎం, కాంగ్రెస్‌, భారత్‌ బచావో, ఆమ్‌ఆద్మీ పార్టీలు బలపరిచిన సీపీఐ నాయకుడు బండి వెంకటేశ్వరరావు , ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా పిట్టా ధనుంజయకుమార్‌, జిల్లేళ్లమూడి నాగ ఉమామహేశ్వరరావు, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా ములగాల జోషిల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. పోలవరం నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా మొడియం సూర్యచంద్రరావు కేఆర్‌పురం ఐటీడీఏలో ఆర్వో ఎం.సూర్యతేజకు నామినేషన్‌ అందించారు. టీడీపీ తరపున సూర్యచంద్రరావు చివరివరకు సీటును ఆశించగా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. గోండ్వానా దండకారుణ్య పార్టీ అఽభ్యర్థిగా మడకం వెంకటేశ్వరావు, ఉయికె మంగమ్మ, కాకా కృష్ణ స్వతంత్య్ర అభ్యర్థులు నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి సూర్యతేజకు అందజేశారు. చింతలపూడి ఆర్వో కార్యాలయంలో ఉన్నమట్ల ఎలీజా కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయగా, మొవ్వల ఎస్తేర్‌రాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. నూజివీడు వైసీపీ అభ్యర్థిగా మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు నామినేషన్‌ దాఖలు చేశారు. కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్‌, భారత చైతన్య యువజన పార్టీ ఆభ్యర్థిగా కమతం నిరీక్షణరావు, జైభీమ్‌రావు భారత్‌ పార్టీ అభ్యర్థిగా జి. సతీష్‌కుమార్‌, ఇండిపెడెంట్‌ అభ్యర్థులుగా చింతాడ శ్రీనివాసరావు, మాదాసు సత్యనారాయణ, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా పాముల ఏశుపాదం నామినేషన్లును దాఖలు చేశారు.

Updated Date - Apr 24 , 2024 | 12:40 AM