Share News

ఎంపీకి 9, ఎమ్మెల్యేలకు 19

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:31 AM

నరసాపురం పార్లమెంటరీ నియోజక వర్గానికి మంగళవారం ఐదో రోజు తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

ఎంపీకి 9, ఎమ్మెల్యేలకు 19
కలెక్టర్‌కు నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్న ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ, తణుకు, ఆచంట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆరిమిల్లి, పితాని తదితరులు

జిల్లాలో ఐదో రోజు నామినేషన్లు

భీమవరం టౌన్‌/ఆచంట/తాడేపల్లిగూడెం రూరల్‌/ఉండి/ తణుకు, ఏప్రిల్‌ 23: నరసాపురం పార్లమెంటరీ నియోజక వర్గానికి మంగళవారం ఐదో రోజు తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, కలిదిండి వినోద్‌ కుమార్‌వర్మ, స్వతంత్ర అభ్యర్థులుగా మాడపాటి వెంకట వరా హాలరెడ్డి, కేతా శ్రీను, రామదుర్గాప్రసాద్‌, గేదెల లక్ష్మణరావు, అద్దేపల్లి వీరవెంకటసుబ్బారావు నామినేషన్‌ పత్రాలను దాఖ లు చేశారు. ఇప్పటికే నామినేషన్‌ దాఖలుచేసిన వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, గూడూరి జగదీష్‌కుమార్‌ అదనంగా మరోసెట్‌ పత్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు 14 మంది అభ్యర్థులు 20 సెట్ల నామినేషన్లు సమర్పించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం పాలకొల్లు, నర సాపురం మినహా మిగతా ఐదు నియోజకవర్గాల్లో 19 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా పులపర్తి సత్యవేణి, చెరుకూరి కుసమ కుమారి పద్మావతి, అంకె వెంకటరమణ, వైసీపీ అభ్యర్థిగా గ్రంధి సత్యరవితేజ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరపున దండు శ్రీనివాసరాజు, పిరమిడ్‌ పార్టీ తరపున అల్లూరి శ్రీనివాసరాజు, జై భారత్‌ నేషనల్‌ పార్టీ తరపున బస్వనీ పవన్‌కుమార్‌ నామినేషన్‌లు దాఖలు చేశారు. ఆచం ట జైభారత్‌ నేషనల్‌ పార్టీ తరపున వెలగల శ్రీనివాసరెడ్డి, తాడేపల్లిగూడెం బీఎస్పీ అభ్యర్థిగా కొత్తపల్లి వెంకటేశ్వరరావు, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా మేక వెంకటేశ్వర రావు, స్వతంత్ర అభ్యర్థులుగా మేకా వెంకటేశ్వరరావు, సిరివ రపు సింహాచలం, ఉండి వైసీపీ అభ్యర్థిగా పెన్మెత్స వెంకట లక్ష్మీనరసింహరాజు, కాంగ్రెస్‌ అభ్యర్థులుగా వేగేశ్న గోపాల కృష్ణంరాజు, వేగేశ్న వెంకటరామరాజు, వేటుకూరి వెంకట శివరామరాజు, తణుకు స్వతంత్ర అభ్యర్థులుగా మామిడిశెట్టి మోహన్‌ అజి, కోడూరి మెహర్‌ చైతన్య నామినేషన్లు దాఖలు చేశారు.

Updated Date - Apr 24 , 2024 | 12:31 AM