Share News

యువ ఓటర్లే కీలకం

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:55 PM

సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్ల కీలకం కానున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి భారీగానే కొత్తఓటర్లు వచ్చారు. కళాశాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు, ఆన్‌లైన్‌లో నమోదు వంటి అంశాలు కలసి వచ్చాయి.

యువ ఓటర్లే కీలకం

భారీగా పెరిగిన కొత్త ఓటర్లు..

కలెక్టరేట్‌కు చేరిన కార్డులు

భీమవరం టౌన్‌, మార్చి 22 : సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్ల కీలకం కానున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి భారీగానే కొత్తఓటర్లు వచ్చారు. కళాశాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు, ఆన్‌లైన్‌లో నమోదు వంటి అంశాలు కలసి వచ్చాయి. మొన్న డ్రాఫ్ట్‌ నోటిఫికేన్‌ నాటికి 13,500 మంది యువ ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు అయింది. దాదాపు 34,314 మంది యువ ఓటర్లు నమోదయ్యారు. నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో ఆచంట నియోజకవర్గంలో 4,312 మంది, పాలకొల్లు 4.657, నరసాపురం 3,917, భీమవరం 5,603, ఉండి నియోజకవర్గంలో 5,293, తణుకు 5,460, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 5,072 మంది కొత్తగా నమోదయ్యారు. ఈ యువ ఓటర్ల ఎటువైపు మొగ్గుచూపుతారో అనేది ఇప్పుడు నియోజకవర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది. ఇప్పటికే నమోదైన ఓటర్లకు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే కార్డులు కలెక్టర్‌ కార్యాలయాలకు చేరడంతో వాటిని పోస్టల్‌ శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రతీకార్డుపై క్యూఆర్‌ కోడ్డు ఉంటుంది దానిని స్కానింగ్‌ చేసిన తరువాత మాత్రమే జిల్లా అధికారులు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఎవరైనా కార్డులు దారులు లేకపోతే తిరిగి వచ్చిన వాటిని బీఎల్‌వోల ద్వారా ఓటర్లకు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:55 PM