కూటమి జోష్
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:10 AM
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరవుతుండటంతో ఆ మేరకు పక్కాగా బీజేపీ కేడర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం
జిల్లా నుంచి బయలుదేరుతున్న కూటమి శ్రేణులు
నియోజకవర్గానికి 200 పాస్‌లు.. 28 డీలక్స్ బస్సులు
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరవుతుండటంతో ఆ మేరకు పక్కాగా బీజేపీ కేడర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా నియోజక వర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా తమ వారందరికి దిశా నిర్దేశం చేశారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో కూటమి ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలతోపాటు ఎంపీ స్థానాన్ని అలవోకగా కూటమి ఏకపక్షంగా గెలిచింది. ప్రజాతీర్పు పెనుసునామీలా వైసీపీని తుడిచిపారేసింది. ఆ పార్టీకి ఎన్నడూ లేనంత ఘోర పరాజయాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో కూటమి పక్షాన నేడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు గన్నవరం దిశగా ప్రయాణం ఆరంభించారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది ప్రత్యేక వాహనాల్లో ఆర్టీసీ బస్సుల్లో తరలి రావడానికి సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు అంటే ప్రాణమిచ్చేవారు, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ అంటే ఎన్ని త్యాగాలకైనా ఓర్చుకునే వారు, బీజేపీ అంటే పడిచచ్చే వారంతా కూటమి పక్షాన జరిగే ప్రమాణస్వీకార మహోత్సవానికి స్వచ్ఛందంగా తరలుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయ నున్నారు. దీనిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లాలో కూటమి శ్రేణులు ఉరకలు వేస్తున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సన్నా హాలు చేసుకుంటున్నారు.అయితే కార్యక్రమాన్ని పరిమితంగానే నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజ కవర్గానికి 200 పాస్‌లు మంజూ రుచేశారు. వీటిని జనసేన ఎమ్మెల్యేలున్నచోట సర్దుబాటు చేశారు. ఎమ్మెల్యేకు 100 పాస్ లు, టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్‌కు 100 పాస్‌లు కేటాయించారు. జిల్లా కలెక్టర్ ద్వారా పాస్‌లు మంజూరయ్యాయి. పాస్‌లు పరిమితం చేయడంతో కూటమి శ్రేణులు ఎగుబడుతున్నారు. కార్యక్రమానికి ఎలాగైనా తరలి వెళ్లాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పాస్‌లు లేకపోవడంతో కొందరు తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు నిరుత్సాహం చెందారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా శ్రేణులు రానున్నాయని, అందుకు సహ కరించాలంటూ నియోజకవర్గ నేతలు, ప్రజా ప్రతినిధు లు సర్దిచెబుతున్నారు. జిల్లాలో ముఖ్య నాయకులకు వీవీఐపీ పాస్‌లు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ 20 మందిని ఎంపికచేశారు. మిగిలిన వారికి వీఐపీ పాస్‌లు కేటాయించారు. నియోజకవర్గాల వారీగా డీలక్స్ బస్సులు కేటాయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి నాలుగు బస్సులను వెళ్లనున్నాయి. ఆ దిశగా ఆర్టీసీ చర్యలు తీసుకుంది. బస్సుల్లో కాకుండా సొంత వాహ నాల్లో వెళ్లేందుకు కూటమి శ్రేణులు ఆసక్తి చూపుతు న్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ప్రధానిని ఆహ్వా నించేందుకు ఐదుగురు ముఖ్య నాయకులను నియ మించారు. అందులో జిల్లా నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఉన్నారు. జిల్లా నుంచి ఉదయం ఆరు గంటలకే ప్రమాణ స్వీకారోత్స వానికి హాజరయ్యేలా నాయకులు ఏర్పాటు చేసుకు న్నారు. ఇప్పటికే గెలుపొందిన శాసనసభ్యులంతా విజ యవాడ చేరుకున్నారు. జిల్లా నుంచి ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పులపర్తి అంజిబాబు, రఘురామకృష్ణంరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, బొమ్మిడి నాయకర్ మంగళవారం నుంచే విజయవాడలో ఉన్నారు. వారంతా తమ పార్టీ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు సైతం ముందురోజే విజ యవాడ పయనమయ్యారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వలవల బాబ్జి., పొత్తూరి రామరాజు తమ శ్రేణులతో బుధవారం ఉదయం విజయవాడ వెళ్లేలా ప్రణాళిక చేసుకున్నారు.