Share News

‘ప్రజల హృదయాల్లో నాటికలకు సుస్థిరస్థానం’

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:32 AM

ప్రజల హృదయాల్లో నాటికలు సుస్థిర స్థానం అని హేలాపురి కళాపరిషత్‌ అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ అన్నా రు. వైఎంహెచ్‌ఏ హేలాపురి కళాపరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు స్మారక రాష్ట్ర స్థాయి నాటిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

‘ప్రజల హృదయాల్లో నాటికలకు సుస్థిరస్థానం’
అమృతహస్తం నాటికలో సన్నివేశం

అలరించిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు

ఏలూరు రూరల్‌, జూలై 4 : ప్రజల హృదయాల్లో నాటికలు సుస్థిర స్థానం అని హేలాపురి కళాపరిషత్‌ అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ అన్నా రు. వైఎంహెచ్‌ఏ హేలాపురి కళాపరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు స్మారక రాష్ట్ర స్థాయి నాటిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 7వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. నాటకం కలకలం ఉంటుందని, ఎంతో మంది కళాకారులు నాటకంతో ప్రజల హృదయాల్లో కలకాలం గుర్తుంటాయన్నారు.

అమృతహస్తం నాటిక..

అమరావతి ఆర్ట్స్‌ బృందం ప్రదర్శించిన ‘అమృతహస్తం’ ఆలోచింప చేసింది. ఒక తల్లికడుపున పుట్టిన అన్నాచెల్లెళ్ల ప్రేమ, అనురాగం, ఆధునిక సమాజంలో మృగ్యమైపోతున్న తరుణంలో ఆ బంధాల గొప్పతనం నేటి సమాజానికి అవి ఎంతో అవసరమని తెలిపేలా నాటిక చాటిచెప్పింది. ప్రేమపెళ్లి చేసుకుని, భర్త దాష్టీకానికి గురవుతున్న పిల్లలను భర్తతో సహా ఆదరించిన అన్న ఆడపడుచు భర్త దురాశను ఆధునిక టెక్నాలజీతో చట్టం ముందు నిలబెట్టిన అతని భార్య తెలివితేటలు ఇలా ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మనస్సులను దోచుకుంది. రచన కె.సత్యనారాయణ, దర్శకత్శం వై.హరిబాబు వహించారు.

రాజుగారి గోచీ నాటిక..

కళానికేతన్‌, వీరన్నపాలెం బృందం వారిచే ‘రాజుగారి గోచీ’ నాటిక ఆకట్టుకుంది. రాజుని, పాలనను ఎలాగైనా దారిలో పెట్టాలని చూసే మాజీ మంత్రి నేర విచారణ, నేరస్తుడి శిక్షణ కంటే కూడా నేరం వల్ల అనాథలైన బాధితులను ఆదుకోవడం ముఖ్యమని చెప్పడమే ‘రాజుగారి గోచీ’ నాటిక ప్రేక్షకులను అలరించింది. ఓ చిన్న దీవిలో ఆరువేల జనాభా. ముక్కుపిండి పన్నులు వసూలుచేసే పాలకులు, పేదల శ్రమను దోచుకునేందుకు జూదశాలను ఏర్పాటు చేస్తారు. దానివల్ల ఓ హత్య జరుగుతుంది. హంతకుడికి రాజు ఉరిశిక్ష వేస్తాడు. ఉరిశిక్ష అమలు చేయలేక దాన్ని జైలుశిక్షగా మారుస్తాడు. ఖైదీకి భోజనం, కాపలా, ఆర్థిక వ్యవస్థకు భారమవుతుంది. కూర్చొని తినడానికి అలవాటు పడ్డ హంతకుడు వెళ్ళిపొమ్మనా వెళ్ళడు. చివరకు ఖైదీ కోర్కెలు తీర్చి బుజ్జిగించి దేశం దాటించి వేస్తారు. చివరిగా నేరవిచారణ, నేరస్తుడికి శిక్ష కంటే బాధితులను ఆదుకోవడం ముఖ్యమని చెప్పడమే ‘రాజుగారి గోచీ’ నాటిక విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో వైఎంహెచ్‌ఏ మేనేజ్మెంట్‌ అధ్యక్షుడు వై.సోమలింగేశ్వరరావు, కేబీవీ రమేష్‌, గౌరవ అధ్యక్షుడు గుత్తా కౌసల్యాంద్రరావు, ఎస్‌కే ఖాజావలీ, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:32 AM