Share News

‘నాటకాలతో సమాజంలో మార్పు తథ్యం’

ABN , Publish Date - May 31 , 2024 | 12:06 AM

నాటికలను బతికించుకుందామని..నాటకాలతోనే సమాజంలో మార్పు తథ్యమని, సమాజాన్ని చైతన్య పరిచేవి కళలేనని.. వాటిలో తొలి ప్రాధాన్యం సాంఘిక నాటికలదేనని పలువురు వక్తలు అన్నారు.

‘నాటకాలతో సమాజంలో మార్పు తథ్యం’
సినీ నిర్మాత టి.రామసత్యనారాయణకు పురస్కారం అందజేత

జాతీయ స్థాయి నాటికల పోటీలు ప్రారంభం

భీమవరం అర్బన్‌, మే 30 : నాటికలను బతికించుకుందామని..నాటకాలతోనే సమాజంలో మార్పు తథ్యమని, సమాజాన్ని చైతన్య పరిచేవి కళలేనని.. వాటిలో తొలి ప్రాధాన్యం సాంఘిక నాటికలదేనని పలువురు వక్తలు అన్నారు. డీఎన్నార్‌ ఇంగ్లీషు మీడియం ప్రైమరీ స్కూల్‌ ప్రాంగణంలో చైతన్య భారతి సంగీతం నృత్య నాటక పరిషత్‌ ఆధ్వర్యంలో 17వ జాతీయస్థాయి సాంఽఘిక నాటికల పోటీలు గురువారం ప్రారంభ మయ్యాయి. అనంతరం సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటులు, నాటక రచయిత డాక్టర్‌ పురాణం వెంకటరామకుమార్‌కు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారం, దర్శకులు జనాబ్‌ ఎస్‌ఎం.బాషాకు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం అందించారు. కార్యక్రమంలో డీఎన్‌ఆర్‌ కశాశాల పాలకవర్గ సభ్యులు కూనపరాజు రామకృష్ణంరాజు, చైతన్య భారతి కార్యదర్శి మంతెన రామ్‌కుమార్‌, రాయప్రోలు శ్రీనివాసముర్తి, భట్టిప్రోలు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

‘మూల్యం’ నాటిక ప్రదర్శన..

నేటి సమాజంలో మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నప్పటికీ ఇంకా మహిళా శక్తిని అవమానిస్తున్నారని తెలిపిన నాటిక గోవాడ క్రియేషన్స్‌ హైదరాబాద్‌ వారి ‘మూల్యం’ నాటిక. ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి అడుగడుగనా చదువులు, పెళ్లి అన్నింటా చిన్నచూపు వివక్ష ఎదుర్కొంటున్నారని ఇలాంటి దారుణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి తన హక్కును నిరూపించుకుని మరీ సాధించిన ఒక అపూర్వ ఘటనే ఈ నాటిక. నాటిక రచన సింహ ప్రసాద్‌, దర్శకత్వం డాక్టర్‌ వెంకట్‌ గోవాడ, నటీనటులుగా డాక్టర్‌ వెంకట్‌ గోవాడ, జ్యోతిరాజ్‌, భాగీ శివశంకర శాస్ర్ట్తి, టి.బాల గంగాధరరావు, హనుమాన్‌ చాగంటి, లక్ష్మణవర్మ. సంగీతం నాగరాజు, లైటింగ్‌ దివాకర్‌ ఫణీంధ్ర, నిర్వహణ డాక్టర్‌ రాధ వ్యవహరించారు.

Updated Date - May 31 , 2024 | 12:06 AM