Share News

అంతా ఒక్కటయ్యారు..!

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:44 PM

కొల్లేరు సరస్సులో అది ఓ చిన్న గ్రామం.. వివాదాలక తీతంగా అభివృద్ధితోపాటు అన్నీ సమస్యలు పరిష్కారమయ్యేవి. అలాంటి గ్రామం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వర్గాలుగా చీల్చిపోయి గత మూడున్నరేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాగా నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ రెండు వర్గాల మధ్య సఖ్యతను ఏర్పరిచి గ్రామాభివృద్ధికి ఐక్యతగా పని చేయండంటూ వెన్నుతట్టారు.

అంతా ఒక్కటయ్యారు..!
ఎమ్మెల్యే కామినేనికి కృతజ్ఞతలు తెలుపుతున్న నత్తగుల్లపాడు గ్రామస్థులు

వైసీపీ హయాంలో రెండుగా చీలిన నత్తగుల్లపాడు

ఎమ్మెల్యే కామినేని చొరవ.. మూడున్నరేళ్ల వివాదానికి తెర

కైకలూరు, జూలై 5: కొల్లేరు సరస్సులో అది ఓ చిన్న గ్రామం.. వివాదాలక తీతంగా అభివృద్ధితోపాటు అన్నీ సమస్యలు పరిష్కారమయ్యేవి. అలాంటి గ్రామం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వర్గాలుగా చీల్చిపోయి గత మూడున్నరేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాగా నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ రెండు వర్గాల మధ్య సఖ్యతను ఏర్పరిచి గ్రామాభివృద్ధికి ఐక్యతగా పని చేయండంటూ వెన్నుతట్టారు. వివరాలివి..

కైకలూరు మండలం నత్తగుల్లపాడు గతంలో చటాకాయ్‌ పంచాయతీ పరిధిలో ఉండేది. మూడేళ్ల క్రితం ప్రత్యేక పంచాయతీగా నత్తగుల్లపాడును గుర్తించారు. అప్పటికే గ్రామస్థుల మధ్య స్వల్ప వివాదాలు ఉండేవి. ఇదే అదనుగా వైసీపీ పాలకులు పంచాయతీ ఏకగ్రీవం కానివ్వకుండా ఎన్నికలకు తెరతీశారు. పంచాయతీ ఏర్పడిన మొదటి దఫా ఎన్నికల్లోనే ఇరువర్గాల మధ్యన ఆసక్తికర పోరు జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అనుకూల అభ్యర్థి ముంగర రామకృష్ణంరాజు సర్పంచ్‌గా గెలుపొందారు. కొల్లేరు గ్రామం కావ డంతో ఈ వివాదాలు చినికిచినికి పెద్దవి కావడంతో గ్రామాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. గ్రామ కట్టుబాట్ల మధ్య చెరువుల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామపెద్దల ద్వారా గ్రామాభివృద్ధికి, ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేసేవారు. గతంలో ఏటా గ్రామానికి రూ.20 లక్షల ఆదాయం చెరువుల నుంచి వచ్చేది. అయితే మూడేళ్లుగా చెరువుల పాటలు జరగకుండా గ్రామస్థులు అడ్డుకోవడం తో రూ.60 లక్షలు నష్టం వాటిల్లింది. దీంతో ఆలయాల్లో దీపాలు వెలిగించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందు కొందరు గ్రామస్థులు డాక్టర్‌ కామినేని దృష్టికి తీసుకువెళ్లారు. తను గెలిచిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపుతానంటూ ఆయన హామీ ఇచ్చారు. దీంతో గ్రామంలో కామినేనికి మెజార్టీని అందించారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆయన గ్రామస్థులంతా ఏకమై నా దగ్గరకు వస్తే మీ సమస్యలను పరిష్కరిస్తానంటూ తెలిపారు. గ్రామస్థులు పలు దఫాలుగా చర్చించుకున్నా సమస్య కొలిక్కి రాలేదు. ఎమ్మెల్యే కామినేని సూచనలతో రాష్ట్ర టీడీపీ వడ్డీ సాధికారిక సమితీ కన్వీనర్‌ బలే ఏసురాజు ఇరువర్గాలను సము దాయించి ఒకేతాటి పైకి వచ్చారు. గ్రామస్థులంతా కామినేని ఇంటివద్ద ఆయ నను కలిసి సంఘటితంగా ఉంటామని గ్రామాభివృద్ధికి కృషి చేయాలంటూ కోరారు.

ఇదే స్ఫూర్తితో ఇకపై ప్రజలంతా ఒకే తాటిపై ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చిన్నపాటి సమస్యలు వచ్చినా సమన్వయంతో పరిష్కరించుకో వాలే తప్ప గ్రామాల్లో గొడవలకు ఎవరూ ప్రోత్సహించవద్దని ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని కామినేని వారికి అభయమిచ్చారు. దీంతో మూడు న్నరేళ్లుగా నెలకొన్న వివాదానికి తెర పడిందని గ్రామస్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కామినేనికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 11:44 PM