Share News

నాటక పరిషత్‌ల కృషి ఎనలేనిది

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:44 AM

కనుమరుగవుతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించడానికి నాటక పరిషత్‌లు చేస్తున్న కృషి ఎనలేనిదని పలువురు వక్తలు అన్నారు.

నాటక పరిషత్‌ల కృషి ఎనలేనిది
అప్పాజోస్యుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం,

ప్రముఖ రంగస్థల నటీమణి రత్నకుమారికి సత్కారం

నాలుగో రోజు రెండు నాటికల ప్రదర్శన

భీమవరం అర్బన్‌, జూన్‌ 2: కనుమరుగవుతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించడానికి నాటక పరిషత్‌లు చేస్తున్న కృషి ఎనలేనిదని పలువురు వక్తలు అన్నారు. చైతన్యభారతి సంగీత నృత్య నాటక పరిషత్‌ ఆధ్వర్యంలో భీమవరంలోని డీఎన్‌ఆర్‌ ఇంగ్లీష్‌ మీడియ స్కూల్‌ ఆవరణంలో జరుగుతున్న 17వ జాతీయ స్థాయి తెలుగు నాటిక పోటీలలో నాలుగో రోజు ఆదివారం రాత్రి రెండు నాటికలు ప్రదర్శించారు. ముందుగా ఈ నాటిక పోటీలను మావుళ్లమ్మ దేవస్థానం మాజీ చైర్మన్‌ కారుమురి సత్యనారాయణ, సూర్యమిత్ర చైర్మన్‌ ఇర్రింకి సూర్యరావు, సీనియర్‌ న్యాయవాది తాడిమళ్ల గిరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆజో,విభో,కందాళం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అప్పాజోస్యుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి ఎం.రత్నకుమారికి పెనుపోతుల శేషగిరిరావు రంగస్థల చైతన్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆనంతరం ప్రదర్శించిన రెండు నాటికలు ఆహుతులను కళా ప్రియులను అలరించాయి. నాటక పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షులు రాయప్రోలు భగవాన్‌, రాయప్రోలు శ్రీనివాసముర్తి, భట్టిప్రోలు శ్రీనివాస్‌, బోండా రాంబాబు, పేరిచర్ల లక్ష్మణవర్మ, కట్రేడ్డి సత్యనారాయణ, వడుపు గోపి పాల్గొన్నారు. నాటికల న్యాయ నిర్ణేతలుగా మనాపురం సత్యనారాయణ, పంపన ధనంబాబు, డాక్టర్‌ ఎన్‌వీ కృష్ణారావు వ్యవహరించారు.

‘స్వప్నం రాల్చిన అమృతం’

‘ఒక కాకికి దెబ్బతగిలి కిందపడితే పది కాకులు చుట్టు చేరి కావు... కావు అంటూ అరుస్తాయి.. వాటి మధ్య ఏ బంధాలు సంబంధాలు లేకపోయినా సరే సాటి కాకులుగా గొప్ప సానుభూతిని చూపిస్తాయి. భార్య భర్తల బంధానికి అనుబంధానికి విలువనిచ్చే మనుషులం.. ఆ కాకుల్లో ఉన్న కనీస జ్ఞానం మనలో లేకపోతే ఎలా’ అని తెలియజేప్పిన స్వప్నం రాల్చిన అమృతం నాటిక, మూలకఽథ పీఎస్‌ నారాయణ, నాటీకీకరణ రచన పరమాత్ముని శివరాం, రమేష్‌ మంచాల దర్మకత్వం వ్యవహరించగా.. నటీనటులు తమ పాత్రలతో అందరిని అలరించారు. చివరి నాటికగా వీటీపీఎస్‌ కల్చరల్‌ అసోసియోషన్‌ ఇబ్రహీంపట్నం వారి ‘ఎనిమి’ నాటిక ప్రదర్శంచారు.

Updated Date - Jun 03 , 2024 | 12:44 AM