Share News

మేమున్నామని..

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:47 AM

‘తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుంది. మీకు కష్టాలు ఎదురైనప్పుడు తోడుండేది తెలుగుదేశమే. చంద్రబాబు మీద అక్రమ కేసులు బనాయించారు. రకరకాల ఆరోపణలు చేస్తూ రోజుకొక కట్టుకథ అల్లారు. ఆయనతోపాటు కార్యకర్తలను దండించారు. ఇప్పటికైనా ఈ అరాచక పాలన పోవాల్సిందే’ అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.

మేమున్నామని..
జంగారెడ్డిగూడెం మహిళలకు భువనేశ్వరి అభివాదం

బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా

నిజం గెలవాలి పేరిట పలువురికి పరామర్శ

ఏలూరు/కొయ్యలగూడెం/జంగారెడ్డిగూడెం/టి.నరసాపురం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుంది. మీకు కష్టాలు ఎదురైనప్పుడు తోడుండేది తెలుగుదేశమే. చంద్రబాబు మీద అక్రమ కేసులు బనాయించారు. రకరకాల ఆరోపణలు చేస్తూ రోజుకొక కట్టుకథ అల్లారు. ఆయనతోపాటు కార్యకర్తలను దండించారు. ఇప్పటికైనా ఈ అరాచక పాలన పోవాల్సిందే’ అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ‘నిజం గెలవాలి’ పేరిట భువనేశ్వరి మంగళవారం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో పర్యటించారు. భువనేశ్వరి ఉదయం రాజమండ్రి విమానాశ్రయం నుంచి నేరుగా కన్నాయిగూడెంలోని దిర్శిపోం వెంకటలక్ష్మి, ఎర్రంపేటలో చండ్ర చినకన్నయ్య, పేరంపేటలో భీమడోలు వెంకయ్య, జంగారెడ్డిగూడెంలో నల్లజర్ల కృష్ణ కుటుంబాలన్ని పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యుల కన్నీటి పర్యంతం కాగా, భయం లేదు.. పార్టీ అండగా ఉంటుందంటూ భుజం తట్టి ఓదార్చారు. పార్టీ పక్షాన అన్ని విధాలా మీకు తోడుగా వుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మాదక ద్రవ్యాలు, నాసిరకం మద్యం, ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. రాష్ట్రానికి అత్యవసరమైనపోలవరం ప్రాజక్టు నిర్మాణంలో చంద్రబాబు ఎంతో చొరవ చూపించారు. ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం సర్వ నాశనం చేసింది. బాధిత కుటుంబాలన్నీ సాధారణ, మధ్యతరగతి కుటుంబాలని వీరితోపాటు మిగతా కుటుంబాలు రాష్ట్రంలో అరాచక పాలనకు సాక్షులుగా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ చంద్రబాబుతోనే సాధ్యం’ అని ఆమె పర్యటించిన చోటల్లా చెప్పారు. అరాచక పాలన నుంచి పారద్రోలాలని పిలుపునిచ్చారు. భువనేశ్వరి ఆయా కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో కొందరు భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారు. అందరినీ ఆమె ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆమె వెంట మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, ఘంటా మురళి, గన్ని వీరాంజనేయులు, మొడియం శ్రీనివాస్‌, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌, చింతలపూడి, పోలవరం అభ్యర్థులు సొంగా రోషన్‌కుమార్‌, చిర్రి బాలరాజు, పోలవరం టీడీపీ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌చంద్ర, మండవ లక్ష్మణరావు, షేక్‌ ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్‌, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, రాజాన సత్యన్నారాయణ, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, పారేపల్లి నరేష్‌, పారేపల్లి రామారావు, సురేష్‌, సోంబాబు, ముడియం సూర్యచంద్రం తదితరులు పాల్గొన్నారు.

నేడు భువనేశ్వరి పర్యటన ఇలా..

భువనేశ్వరి మంగళవారం రాత్రి చింతలపూడిలోని ‘కె’ కన్వెన్షన్‌లో బస చేశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం పదిన్నర గంటలకు టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో మృతి చెందిన కార్యకర్త అబ్బదాసరి కృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శి స్తారు. మధ్యాహ్నం 1.15 గంటలకు తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు పెంట పాడు మండలం పశ్చిమ విప్పర్రులో బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. 3.55 గంటలకు నిడమర్రులో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు.

Updated Date - Mar 27 , 2024 | 12:47 AM