Share News

సూపర్‌ సిక్స్‌తో ఎంతో మేలు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:27 AM

‘రాష్ట్రంలో పేదల సంక్షేమానికి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పేరిట అభివృద్ధి బాటలు వేస్తుంది. ఇదెంతో మీకు మేలు చేస్తుంది. పేదరిక నిర్మూలనకు దోహదపడుతుంది’ అని నారా భువనేశ్వరి అన్నారు.

సూపర్‌ సిక్స్‌తో ఎంతో మేలు
వెస్ట్‌ విప్పర్రులో నారా భువనేశ్వరి

రాష్ట్రాన్ని మింగేసిన వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి

టీడీపీతోనే సంక్షేమాభివృద్ధి సాధ్యం

పేద ప్రజలకు ఈ పథకాలే ఆలంబన

మహిళల సంక్షేమానికి మరింత అండ

పార్టీ కేడర్‌కు అంతా అండగా ఉంటాం

నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి

ఏలూరు/టి.నరసాపురం/తాడేపల్లిగూడెం రూరల్‌/పెంట పాడు/ నిడమర్రు/ నూజివీడు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో పేదల సంక్షేమానికి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పేరిట అభివృద్ధి బాటలు వేస్తుంది. ఇదెంతో మీకు మేలు చేస్తుంది. పేదరిక నిర్మూలనకు దోహదపడుతుంది’ అని నారా భువనేశ్వరి అన్నారు. ఉమ్మడి పశ్చిమలో రెండో రోజు బుధవారం ‘నిజం గెలవాలి’ పేరిట పర్యటించి బాధిత టీడీపీ కార్యకర్తల కుటుం బాలను ఆమె పరామర్శించారు. చింతలపూడిలోని ‘కె’ కన్వెన్షన్‌ నుంచి ఉదయం బయలుదేరారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ ను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన టి.నరసాపురం మక్కినవారిగూడెంలో అబ్బదాసరి కృష్ణ, తాడేపల్లిగూడెం మం డలం కుంచనపల్లిలో తాడేపల్లి శేఖర్‌, పెంటపాడు మండలం పడమరవిప్పర్రులో కోడి అప్పారావు, నిడమర్రులో గొర్రెల సుబ్బారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె పార్టీ మీ కుటుంబాల అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనం తరం వారి చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళుల ర్పించారు. ఆమె వెళ్లిన అన్నిచోట్లా పార్టీ కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు, మరికొందరు తమంతట తాముగా పరిచ యం చేసుకున్నారు. ఆయా ప్రాంతాల పరిస్థితులు, పార్టీ కుటుంబాల స్థితిగతులను భువనేశ్వరి ఆరాతీశారు. పలుచోట్ల కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘వచ్చే ఎన్నికలు చాలా కీలకం. రాష్ట్ర భవిష్యత్‌కు అద్దం పడతాయి. దీన్ని కురు క్షేత్రంగా భావించి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగిం చుకోవాలి. వైసీపీ సర్కార్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలా మింగేసి ప్రజా జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఒకప్పుడు ఎంతో శాంతిగా ఉండే రాష్ట్రంలో ఇప్పుడు టన్నులకొద్దీ గంజాయి రవాణా అవుతోందని, విశాఖ పోర్టుకు 25 వేల కిలోల మాదక ద్రవ్యాలు దిగుమతి అవ్వడం తాజా ప్రమాదస్థాయిని తెలియ చేసింది. ప్రతి కుటుంబానికి తండ్రి ఎంత అవసరమో, రాష్ట్రానికి ఇప్పుడు సమర్థుడైన నాయకుడు అంత అవసరం. ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకునేందుకే బయటకు రావాల్సి వచ్చింది. సూపర్‌సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలే జరుగు తుంది. మహిళలకు మరింత సంక్షేమం, ఊతం ఈ పథకాల ద్వారా అందుతాయి. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. ఈ కారణం గా అక్కడ ఉద్యోగాలకు కొదవ లేదు. విభజన తర్వాత పారిశ్రా మికవేత్తలు కేవలం చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో పెట్టుబడులతో తరలివచ్చారు. నిరుద్యోగత తగ్గిం చేందుకు ప్రయత్నించారు. కానీ ఇప్పుడా పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా ? లేదు. చంద్రబాబు అంటే తెలియని భారతీ యుడు ఉండరు. అంతలా రాష్ట్రగౌరవాన్ని పెంపొందించారు. చంద్ర బాబు నేతృత్వంలోనే మరింత అభివృద్ధికి సరికొత్త బాటలు వేయడానికి వీలుపడుతుంది’ అని అన్నారు.

నేడు నూజివీడులో పర్యటన

భువనేశ్వరి గురువారం నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని బెజ వాడ రామారావు, ఆగిరిపల్లిలో కలవకొల్లు శ్రీరాములమ్మ, పల గాని చంద్రయ్య కుటుంబ సభ్యులను, నూజివీడు మండలం గొల్లపల్లిలో వెనిగళ్ళ పూర్ణచంద్రరావు కుటుంబాలను పరామర్శి స్తారు. అనంతరం గుడివాడ నియోజకవర్గానికి వెళతారు.

ఆడపడుచు లాంఛనాలు

తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌, అనురాధ దంపతులతో పాటు కోడలు శ్రీదేవిప్రియ పసుపు కుంకుమ, చీరతో ఆడపడచు లాంఛనం అందించా రు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌ తన సతీమణితో కలిసి హారతులు ఇచ్చి భువనేశ్వరికి గుమ్మడికాయలతో దిష్టి తీశారు. పెంటపాడులో మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, పూలు చల్లుతూ, హారతులతో స్వాగతం పలికారు. పడమరవిప్పర్రులో భువనేశ్వరిని చూసేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. అప్పన్న వీడు అభయాంజనేయస్వామిని దర్శించుకుని కృష్ణా జిల్లా బిల్లనపల్లి వెళ్లారు. ఏలూరు ఎంపీ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్‌కుమార్‌యాదవ్‌, తణుకు, తాడేపల్లి గూడెం, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి అభ్యరు ్థలు ఆరిమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్‌, చిర్రి బాల రాజు,పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్‌, టీడీపీ జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనే యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు వలవల బాబ్జి, బొర గం శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి,గన్నిన సురేంద్రనాథ్‌ చౌదరి, శీలం వెంకటేశ్వరరావు, జయ్యవరపు శ్రీరా మమూర్తి, నల్లూరి వెంకట చలపతిరావు, ఆచంట సూర్యనారాయణ, పరిమి రవికుమార్‌, వాడపల్లి సుబ్బరాజు, సత్యనా రాయణ, కిలపర్తి వెంకట్రావు,చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:27 AM