Share News

మున్సిపల్‌ కార్యాలయ ముట్టడి

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:40 AM

మున్సిపల్‌ కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు.

మున్సిపల్‌ కార్యాలయ ముట్టడి
ఏలూరు నగర పాలక సంస్థ వద్ద కళ్లకు గంతలతో కార్మికుల నిరసన

పారిశుధ్య కార్మికుల సమ్మె, నిరసన

ఏలూరు టూటౌన్‌, జనవరి 6: మున్సిపల్‌ కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. వివిధ విభాగాల కార్మికులు శనివారం నగర పాలక సంస్థ వద్దకు చేరుకుని గేట్లు మూసివేసి సిబ్బందిని లోనికి వెళ ్లకుండా అడ్డుకున్నారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంద న్నారు. రెండు దఫాలుగా చర్చలు జరిగినప్పటికి ఎలాంటి పురోగతి లేద న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలన్నారు. లేకుంటే ఈ నెల 8న కలెక్టరేట్‌ ముట్టడిస్తామన్నారు. ఎన్నికల ముందు జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. కృష్ణారావు, జాన్‌బాబు, వెంకటేశ్వరరావు, నాగరాజు, హనుమంతరావు, రాజు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ, కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరింది. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద శనివారం కార్మికులు కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణమాచార్యులు, కన్నబాబు, అప్పలరాజు, శ్రీనివాసరావు, భాస్క రరావు, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

చింతలపూడి: మునిసిపల్‌ కార్మికులు శిబిరంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు టి.బాబు మా ట్లాడుతూ మునిసిపల్‌ కార్మికుల సమ్మె న్యాయమైనదేనని, ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయకపోవడం దారుణమన్నారు. కంచర్ల గురవయ్య, అంగన్‌వాడీ నాయకురాలు గంధం అంజమ్మ, ఆర్‌.మరియమ్మ, మల్లేశ్వరి, మానుకొండ సర్వేశ్వరరావు పాల్గొన్నారు. మునిసిపల్‌ వర్కర్లు, అంగన్‌వాడీల సమస్యల సమ్మె ఉధృతమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ నాయకులు ఆర్‌వీ.సత్యనారాయణ అన్నారు. మునిసిపల్‌ కార్మికులతో మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు సరోజిని, మాణిక్యం, పలువురు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం టౌన్‌: మున్సిపల్‌ కార్మికులు కళ్లకు నల్ల రిబ్బన్‌ కట్టు కుని నిరసన తెలియజేశారు. ఐఎఫ్‌టీయూ నాయకులు కెవి.రమణ, ఎస్‌ రామ్మోహన్‌ సమ్మెకు సంఘీభావం తెలిపారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూ నియన్‌ పట్టణ కార్యదర్శి బొక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎరియర్స్‌ చెల్లించాలని, తమకు అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిం చాలని కోరారు. కార్యక్రమంలో జేవీ.రమణరాజు, కొత్తూరి నాగేశ్వరరావు, రేలంగి నాగరాజు, పితాని సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:40 AM