Share News

వైసీపీకి ఎంపీ రఘురామ గుడ్‌బై

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:38 AM

నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ లేఖను పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌కు పంపించారు.

 వైసీపీకి ఎంపీ రఘురామ గుడ్‌బై

కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచే పోటీ

ఏ పార్టీ నుంచి అనేది త్వరలో క్లారిటీ

జగన్‌ సర్కార్‌తో నాలుగేళ్లుగా పోరాటం

స్వస్థలం వచ్చేందుకు అవరోధాలు.. కేసులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ లేఖను పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌కు పంపించారు. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కాలంలో ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో గళ మెత్తడం పై పార్టీ అధిష్ఠానంతో విభేదాలు తలెత్తాయి. జగన్‌ సర్కార్‌ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం ప్రశ్నించేవారు. దీనిపై పార్టీ అధిష్టానం ఆయనపై కక్ష గట్టి అరె స్టు చేయించి రాజద్రోహం వంటి కేసులు పెట్టి వేధించసాగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడు తున్నారంటూ ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు లోక్‌ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇంత జరుగుతున్నా ఆయ నను పార్టీ నుంచి సస్పెం డ్‌ చేసేందుకు సాహ సించలేదు. మరోవైపు నాలుగేళ్లుగా నియోజకవర్గానికి రాలేని పరిస్థితి. భీమ వరంలో ప్రధాని మోదీతో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు భారీ విగ్రహం ప్రారంభోత్సవానికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా కోర్టు ద్వారా ప్రత్యేక భద్రత తీసుకుని భీమవరం వచ్చారు.

ఎంపీ లాడ్స్‌పైనా అయిష్టత

ఎంపీపై అధికార పార్టీకి ఎంత కక్ష అంటే.. చివరకు ఎంపీ లాడ్స్‌ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు వినియోగించుకోలేదు. తెలుగుదేశం, జనసేన నేతలే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించేందుకు ఎంపీని సంప్రదించి నిధులు రాబట్టుకున్నారు. ఈ పనులకు కూడా అధికార పార్టీ నేతలు అవరోధాలు సృష్టించారు. టెండర్లు పిలవకుండా కట్టడి చేశారు. ఇలా నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో పలు నియోజకవర్గాల్లో ఎంపీ నిధులకు మోక్షం లభించలేదు. మరోవైపు పాలకొల్లు, ఉండి, తాడేపల్లిగూడెం, ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన నాయకులు ఎంపీ నిధులను వినియోగించుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. తెలుగుదేశం, జనసేన సర్పంచ్‌లు ఉన్న చోట పనులు కొనసాగాయి. జగన్‌ సర్కార్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిత్యం ఎండగడుతూ ప్రజలకు రఘురామ చేరువ య్యారు. ప్రతిపక్షాలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకీ రాజీనామా చేశారు. తెలుగుదేశం–జనసేన పొత్తులో భాగంగా తొలి విడత సీట్లు ప్రకటించన రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తులు ఫైనల్‌ అయిన తర్వాత బీజేపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ లేకుంటే టీడీపీ నుంచి పోటీ చేయవచ్చు. పొత్తులు పూర్తిగా ఫైనల్‌ అయిన తర్వాత దీనిపై క్లారిటీ వస్తుంది.

Updated Date - Feb 25 , 2024 | 12:38 AM