Share News

సోమవారం.. పోదాం పోలవరం

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:44 AM

సోమవారం రానే వచ్చింది. అయితే ఏంటంటారా ? లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కీలక బహుళార్థక సాధక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలుగు దేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీవారాన్ని లక్ష్యంగా ఎంచుకు న్నారు.

సోమవారం.. పోదాం పోలవరం
హెలీప్యాడ్‌ వద్ద తనిఖీలు

గడిచిన ఐదేళ్లల్లో పోలవరం సర్వనాశనం

పోలవరం ఎత్తు తగ్గించినా నో అనని జగన్‌ సర్కార్‌

నిర్వాసిత కుటుంబాలతోను చెడుగుడు

కూటమి రాకతో పోలవరానికి పూర్వ కళ

నేటి నుంచే మళ్లీ సోమవారం ఆనవాయితీ

సోమవారం రానే వచ్చింది. అయితే ఏంటంటారా ? లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కీలక బహుళార్థక సాధక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలుగు దేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీవారాన్ని లక్ష్యంగా ఎంచుకు న్నారు. ప్రతీ సోమవారం పోలవరం పైనే దృష్టి పెట్టి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి సుమారు 73 శాతం పనులను పూర్తి చేసిన ఘన త చంద్రబాబుది. గడిచిన ఐదేళ్లుగా ఈ వారం మారింది.. ప్రాజెక్టు పూర్తయ్యే ముహూర్తం పదేపదే మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అదే సోమవారం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి ఆనవాయితీని కొనసాగించ బోతున్నారు. నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనుల పురో గతిని పరిశీలించి ప్రాజెక్టు స్థలిలోనే ఉన్నతస్థాయి సమీక్షకు దిగుతున్నారు. ఇన్నాళ్ళు ఎడారిగా ఆర్చేసిన పోలవరానికి తిరిగి ఊపిరిపోసి పనుల్లో జీవం తెచ్చేందుకు తిరిగి ఉత్సాహం నింపేం దుకు నేడు ఆరంభ సంకల్ప దినం.

– ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి

పోలవరం ప్రాజెక్టు.. ఈ పేరు చెబితేనే యావత్‌ రాష్ట్ర రైతాంగం అప్రమత్తమవుతుంది. వేల కోట్లు వెచ్చించి కీలక పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేయించడంలో 2014–19 మధ్య అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కంటిమీద కునుకు లేకుండా పనిచేశారు. ప్రాజెక్టు స్పిల్‌వే పనులను కొలిక్కి తీసుకురాగలిగారు. దాదాపు 27 సార్లు పైగా పోల వరం ప్రాజెక్టు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి అక్కడికక్కడ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటు కాంటా క్టు ఏజన్సీకి, ఇటు ఇంజనీర్లకు ఏ రోజుకా రోజు లక్ష్యాలు నిర్దేశించారు. పోలవరం పనుల్లో అనేక రికార్డులు గిన్నిస్‌కు ఎక్కాయి. మరిన్ని రికార్డు బ్రేక్‌లు చరిత్రలోనే నిలిచిపోయా యి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒకవైపు నిర్వాసితులను ఒప్పించి మెప్పించడమేకాకుండా ఎక్కడా పనులకు ఆటంకం లేకుండా సక్సెస్‌ అయ్యారు. మరోవైపు కేంద్రం నుంచి తగిన నిధులు రాబట్టేందుకు శత విధాలా ప్రయత్నించారు. ఫలి తంగా ప్రధాన డ్యాం నిర్మాణానికి అనువైన పరిస్థితులను అప్పట్లోనే ఆయన తేగలిగారు. ఒకవైపు ఎగువ కాఫర్‌ డ్యాం, ఇంకోవైపు దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు అందరినీ పరుగులు పెట్టించారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగు, తాగునీరు అందేలా నిత్య సమీక్షలతో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంధ్రుల జీవనాడిగా ప్రాజెక్టుకు నామకరణం చేసి అనుకున్న లక్ష్యాలకు చేరేందుకు ఎక్కడా జాప్యంకాని, సాంకేతిక లోపం లేకుండా చేయడం ఇంకో ఎత్తు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు పోలవరంపై దృష్టి పెట్టి క్షణం తేడా లేకుండా పనులు పూర్తి చేసేందుకు ప్రయ త్నించారు. కేంద్రం నుంచి నిధులు ఆలస్య మైనా ఆలోపే రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కొంత భరించి మరీ పనుల్లో జాప్యాన్ని తగ్గించగలిగారు. ప్రతీసారి అత్యంత ఆధునిక పద్ధతుల్లోనే ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగుతూ వచ్చింది. ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌డ్యాం నిర్మాణంలో భాగంగా ముందస్తుగా డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. జర్మనీకి చెందిన బావర్‌ కంపెనీ డయాఫ్రంవాల్‌ నిర్మాణంలో కీలక పాత్ర వహించింది. దీని నిర్మాణం పూర్తయిన వెంటనే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం పనులు చకచకా సాగాయి. ఇంకోవైపు జల విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పనులు పరుగులు పెట్టించారు. ఈ విద్యుత్‌ కేంద్రం ద్వారా ఉత్పత్తయిన దానిలో రాష్ట్ర అవసరాలు పోను పొరుగు రాష్ట్రాలకు విక్రయించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్వాసిత కుటుంబాలకు ఎక్కడా అసంతృప్తి ఎదురుకాకుండా అధికార యంత్రాంగాన్ని ముంపు గ్రామాల వైపు నడిపారు. పరిహారం విషయంలో ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తపడ్డారు. కొన్నిచోట్ల న్యాయపరమైన వివాదాలు ఎదురైనప్పుడు తప్ప మిగతా అన్నిచోట్ల పరిష్కారం దిశగానే దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు యంత్రాంగం క్షేత్రస్థాయిలో పనిచేసింది. దటీజ్‌.. చంద్రబాబు అనే దిశగా ఒకవైపు ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఇంకోవైపు సహాయ పునరా వాస కార్యక్రమాలను కొనసాగించ గలిగారు. ఇంకొంతకాలం ఇదే రీతిలో పనిచేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి ఉండేది. అప్పటి జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అత్యధిక సార్లు ప్రాజెక్టును సందర్శించి పనులను సమీక్షించగలిగారు. సీఎం హోదాలో చంద్రబాబు 2019 జనవరి 7వ తేదీన చివరిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

జగడాల జగన్‌తో ఒరిగిందేంటి ?

తెలుగుదేశంను కాదని 2019లో వైసీపీని అధికారంలోకి తెచ్చారు. పర్యావసానంగా సవ్యంగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుకు మహర్దశ కల్పించాల్సింది పోయి.. అష్ట దరిద్రం దాపురించేలా చేశారు. కేంద్రం అడుగులకు మడుగులొత్తుతూ ఇచ్చిన దాంతోనే సరిపెట్టుకుంటూ పోలవరంపై పరోక్షంగా కసి తీర్చుకున్నారు. ఈలోపే 2020–21లో కరోనా విజృంభించ డం, ప్రాజెక్టు నిర్మాణ పనుల కార్మికులు, అధికారులు, సిబ్బం ది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆ తర్వాత 2022 నుంచి పోలవరం పనులు ముందుకు సాగక పోగా లిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.75కు కుదించడంతోపాటు ప్రాజెక్టు వ్యయాన్ని 55 వేల కోట్ల నుంచి 31 వేల కోట్లకు తగ్గించినా ఎవ్వరూ నోరెత్తలేదు. ఒక్క తెలుగు దేశం ఇదేం లెక్క. ప్రాజెక్టును ఏం చేయబోతున్నారంటూ నిలదీసినా అంతా తామే నిర్మాణం పూర్తి చేసే దమ్మున్న వాళ్ళమన్నట్టుగా వైసీపీ మంత్రులు ఫోజులు కొట్టి ఇంకోవైపు చంద్రబాబును ఎద్దేవా చేస్తూ వచ్చారు. 2021–22 సంవత్స రాల్లో గోదావరికి వచ్చిన భారీ వరదలు అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ను దెబ్బతీశాయి. ఇంకోవైపు గైడ్‌బండ్‌ కుంగేలా పరిణామాలు చోటు చేసుకున్నా.. వీటిని జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా పోలవరం పనులపై కేంద్ర బృందాలు తూతూ మంత్రంగా సందర్శించడం, కొన్ని నివేదికలతోనే సరిపెట్టాయి. కాని గడిచిన ఐదేళ్లుగా మూడు సార్లు ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ ముహూర్తాలు పెట్టి రైతులను మోసగించారు. ఇంకోవైపు పోలవరం నిర్మాణానికి త్యాగాల కోర్చిన నిర్వాసిత కుటుంబాలతో చెడుగుడు ఆడారు. వ్యక్తిగత పరిహారం పది లక్షలు చెల్లించి తీరుతామని చెప్పి దాగుడు మూతలాడారు. సీఎం హోదాలో జగన్‌ కేవలం మూడుసార్లు ప్రాజెక్టును నామ్‌కా వాస్తే సందర్శించి సరి పెట్టేశారు. 2014–19లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరుగులెత్తిస్తే.. 2019–24 మధ్య జగన్‌ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు వెనుకబడేలా రికార్డు సృష్టించగలిగింది.

త్యాగాలు చేసింది ఇందుకేనా ?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే లక్షలాది ఎకరా లకు సాగునీరు అందేది. వందల గ్రామాల్లో దాహార్తిని తీర్చేది. కాని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా తమ సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరగ నేలేదు. 2019–24 మధ్య పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాంతరంగా ముంపు గ్రామా ల్లో నిర్వాసిత సంఖ్యను కుదించి ఆ దిశగానే కొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. ఇంకోవైపు చంద్రబాబు పాలనలో నిర్వాసిత కుటుంబాలకు అవసరమైన ప్రత్యేక కాలనీల నిర్మాణం అప్పట్లో చకచకా సాగింది. అప్పటి కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ కంటిమీద కునుకు లేకుండా నిర్వాసితుల కాలనీల నిర్మాణానికి జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం ప్రాంతాల్లో తరచూ విజిట్‌కు వెళ్ళేవారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ తరహా పరిస్థితిని గాలిలో పెట్టింది. అంతకంటే మించి వైసీపీ అధికారంలోకి రాకమునుపు జగన్‌ నిర్వాసిత కుటుం బాల్లో వ్యక్తిగత పరిహారాన్ని పది లక్షలకు పెంచుతూ హామీ లు ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా 2022 చివర్లో ప్రత్యేక జీవోలు జారీ చేశారు. ఇంత చేస్తే నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో ఇవేవీ చేరనేలేదు. అధికారులు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. గోదావరికి వరదలొచ్చినప్పుడు కుక్కునూరు, వేలేరుపాడులలో పర్యటించి సీఎం జగన్‌ ... పరిహారం మాటే ఎత్తకుండా వరదల కారణంగా నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించి ఆ తర్వాత మొండిచెయ్యి చూపించారు. ఫలితంగా దాదాపు 15 వేల కుటుంబాలు అలో లక్ష్మణా అంటూ వాపోయాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబుకి ఆయా అంశాలపై ప్రత్యేక అవగాహన ఉన్నందున కనీసం ఈసారైనా తమ కష్టాలను తీర్చాలని నిర్వాసితులు కోరుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు లేక తెలంగాణకు తరలివెళ్ళిన వందలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం ఎదుట ప్రస్తా వించాలని భావిస్తున్నారు. పోలవరం నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు గెలు పొందారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసిత కుటుంబా లకు ఒకింత ధైర్యం వచ్చింది. తమ ఆర్థిక కష్టాలతోపాటు రోజువారి పని కల్పించగలరనే ధైర్యం కనిపిస్తోంది. వీలైతే తమ పెద్దలతో చంద్రబాబుకు విజ్ఞప్తి చేసేందుకు ప్రయత్ని స్తున్నారు.

పోలవరం మళ్ళీ కళకళ!

ఐదేళ్ల తర్వాత పోలవరం ప్రాజెక్టులో సందడి నెలకొంది. గడిచిన ఐదేళ్లుగా పనులు ముందుకు సాగక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీల సంఖ్య మందగించడంతో పోలవరం అసలు లెక్కలో లేకుండా పోయింది. ఇప్పటికే దెబ్బతిన్న ట్విన్‌టన్నల్స్‌ నిర్మాణ పనులకు మళ్ళీ జీవం వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి అనేక కీలక పరిణామాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తో సహా కేంద్ర నిపు ణుల బృందాలు ఇచ్చిన నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డయా ఫ్రమ్‌వాల్‌ దెబ్బ తిన్నందున కొత్తది కట్టాలా.. వద్దా అనేది తేల్చాలి. కుంగి పోయిన గైడ్‌బండ్‌ విషయంలోను నిపుణుల సలహాల మేరకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. విద్యుత్‌ కేంద్ర నిర్మాణ పనుల్లోను కాంటాక్టు ఏజన్సీని పరుగులు పెట్టించాల్సి ఉంది. ఇవన్నీ నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న సీఎం చంద్రబాబు స్వయంగా ఆయా పనులను పరిశీలించ డమే కాకుండా ఉన్నత స్థాయి సమీక్షను ఇక్కడే నిర్వహించ బోతున్నారు. ప్రత్యేకించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు జల వనరుల శాఖ అప్పగించినందున ఇక పనుల్లోను త్వరితగతిన నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.

చంద్రబాబు పర్యటన ఇలా..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టును ఆసాంతం పరిశీలిస్తారు. కుంగిన గైడ్‌బండ్‌తో పాటు నిలిచిపోయిన అన్ని పనులను పరిశీలి స్తారు. మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 గంటల వరకు ప్రాజెక్టు అధికారులతో గంటపాటు సమీక్షిస్తారు. సహాయక పునరావాస చర్యలు, భూసేకరణ అంశాలు ఇప్పటికే నిలిచిపోయిన వైనాన్ని తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైన సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.40 వరకు మీడియా సమావేశం నిర్వహించి, 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

నాడు అవమానం

జగన్‌ పాలనలో అందరూ అవమానాల పాలైన వారే. అడ్డగోలుగా అణచివేతకు గురైనవారే. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడునూ జగన్‌ ప్రభుత్వం వదలలేదు. 2022, డిసెంబరు1.. ఆనాడు పోలవరం పనులు ఎందుకు చేపట్టలేకపోయారు..? మరెందుకు నీరు గారుస్తున్నారు.. ఇప్పటి వరకు ఏం చేశారో తేల్చికుంటామంటూ చంద్ర బాబు నేరుగా పట్టిసీమ నుంచి పోలవరం వైపు బయల్దేరా రు. ఈ క్రమంలోనే పోలవరం గ్రామ సమీపంలో ఉన్న ప్రాజెక్టు ముఖద్వారం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డగించి వెళ్లడానికి వీల్లేదని శాసించారు. దీంతో చంద్రబాబు భగ్గుమన్నారు. తీవ్ర స్వరంతో తనను ఎందుకు అడ్డుకుంటాన్నారంటూ పోలీసు అధికారులను నిలదీశారు. ప్రతిపక్ష నేతగా, మాజీ సీఎంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించే అధికారం తనకు ఉందని, అడ్డుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చా రంటూ తీవ్ర స్వరంతో విరుకుపడ్డారు. జగన్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నడిరోడ్డుపై బైఠాయించారు. దీంతో అవ్వాక్కయిన పోలీసులు ఆయనకు సర్ది చెప్పేం దుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. మిగతా తెలుగు దేశం నేతల సమక్షంలోనే అంతా కలసి నడిరోడ్డుపై గంటన్నర పైగా బైఠాయించారు. ప్రభుత్వానికి తెలియజేయండి అప్పటి వరకు కదలనంటూ భీష్మించారు. అనాడు చంద్రబాబును జరిగిన అవమానాన్ని, పోలీసుల అడ్డగోలు తనాన్ని వైసీపీ ఎక్కడా ఖండించకపోగా అనాటి జల వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ ఎకసెక్కంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు 28వ సారి పోలవరం సందర్శనకు వస్తున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు

పోలవరం/ఏలూరు క్రైం, జూన్‌ 16 : ముఖ్యమంత్రి చంద్ర బాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు సోమవారం రానున్న నేపథ్యంలో ఆదివారం ప్రాజెక్టు వద్ద జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో భారీగా పోలీస్‌ యంత్రాం గం, ప్రత్యేక పోలీసు బలగాలు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయి. సీఎం పర్యటించనున్న అన్ని ప్రాంతాలకు క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా దళాలు హెలీకాప్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. భద్రత ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రానీయకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర భద్రతా అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు చుట్టూ 25 కిలోమీటర్ల మేర ప్రత్యేక పోలీసు బలగాలు జల్లెడ పట్టాయి. డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా స్పెషల్‌ పార్టీ పోలీసులతో తనిఖీలు చేపట్టారు. మొత్తం 1300 మంది పోలీసులను వినియో గిస్తున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 70 మంది ఎస్‌ఐలు, 1195 మంది హెడ్‌ కానిస్టేబుళ్ళు, ఎఎస్‌ఐలు, ఎఆర్‌ సిబ్బంది, కానిస్టేబుళ్ళు, స్పెషల్‌ పార్టీ పోలీస్‌ సిబ్బందిని వినియోగిస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో వందమంది పారిశుధ్య కార్మిక సిబ్బంది పారిశుధ్య మెరుగుదల కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు కార్యాలయం, హిల్‌వ్యూ ప్రాంతంలో చెత్తను, పొదల్ని తొలగించారు. టీడీపీ పాలనలో ప్రాజెక్టు కార్యాలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన 24 గంటల కాంక్రీట్‌ గిన్నిస్‌ రికార్డు పైలాన్‌, మంత్రివర్గ పైలాన్‌, తొలి రేడియల్‌ గేట్‌ పైలాన్‌లను శుభ్రం చేసి రంగులు వేసి సిద్ధం చేస్తున్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి : మంత్రి నిమ్మల

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేసీ లావణ్య వేణి, పీవో సూర్యతేజ ఇతర అధికారులతో సమీక్షిస్తూ సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.

ఎలాంటి లోటుపాట్లు రానీయొద్దు : ఎమ్మెల్యే చిర్రి

సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన ఏర్పాట్లలో అధికారులు విధులు సక్రమంగా నిర్వర్తించాలని, ఎలాంటి లోటు పాట్లు రాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచిం చారు. ఆదివారం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన అధి కారుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల సుదీర్ఘ విరామా నంతరం చంద్రబాబు ప్రాజెక్టు పరిశీలనకు రానున్నారని, ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగవంతంగా చేసేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేసుకుని అధికారులు తమకు సహకరించాలన్నారు.

అధికారులతో జేసీ సమీక్ష

సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టాలని జేసీ లావణ్యవేణి అధికారులకు సూచించారు. ఆదివారం పోలవరం ప్రాజెక్టు వద్ద చేస్తున్న భద్రతా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. సీఎం పర్యటించనున్న స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు, పవర్‌ హౌజ్‌, డయాఫ్రంవాల్‌, గైడ్‌ బండ్‌, డ్యాం సీపేజీ, లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి అఽధికారులకు సం బంధిత విషయాలపై పలు సూచనలు చేశారు. తొలుత ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన అధికారుల సమీక్షలో జేసీ మాట్లాడుతూ ఫొటో ఎగ్జిబిషన్‌, బారికేడింగ్‌, తాగునీరు, టెంట్లు, మెడికల్‌ క్యాంపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమీక్షలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఐటీడీఏ పీవో సూర్యతేజ, జనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డమణుగు రవి కుమార్‌, గునపర్తి చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:44 AM