Share News

వలంటీర్లకు జీతాలు పెంచి కొనసాగిస్తాం

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:23 AM

రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లకు జీతాలు పెంచి కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

వలంటీర్లకు జీతాలు పెంచి కొనసాగిస్తాం
పెనుమదంలో ఎమ్మెల్యే నిమ్మల పాదయాత్ర

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

పోడూరు, మార్చి 5 : రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లకు జీతాలు పెంచి కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం పెనుమదంలో టీడీపీ, జనసేన శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వలంటీర్లు దుష్ప్రచారాన్ని నమ్మవద్దని చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న వలంటీర్లను అన్నివిధాలా ఆదరిస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, సర్పంచ్‌ తానేటి బాబూరావు, పార్టీ మండల అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పెన్మెత్స రామభద్రరాజు, జనసేన కన్వీనర్‌ బోనం చినబాబు, ఎంపీటీసీలు మానేపల్లి శ్రీధర్‌, విప్పర్తి శారద, గ్రామటీడీపీ అధ్యక్షుడు కడలి ఆంజనే యులు, దేవరపు దొరబాబు, తంగెళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

భారీ మెజార్టీతో గెలిపించండి : ఎమ్మెల్యే రామరాజు

ఉండి, మార్చి 5: భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కోరారు. మంగళవారం మండలంలోని 19 గ్రామాల తెలుగుదేశం–జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఆయా గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా, తనను రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాల నాయకులు ఎమ్మెల్యే రామరాజుతో పాటు, జనసేన ఇన్‌చార్జి జత్తుగ నాగరాజును పూలమాలతో అభినందించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కరిమెరక నాగరాజు, కిన్నెర వెంకన్న, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తుగ శ్రీను, మాజీ జడ్పీటీసీ కాగిత మహంకాళి, ఐటీడీపీ రాష్ట్ర నాయకుడు యశోధ కృష్ణ, ఎంపీటీసీ యువరాజు, కన్నెగంటి రూత్‌కళ, జనసేన మండల కన్వీనరు యడవల్లి వెంకటేశ్వరరావు, యోహోషువా, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ, జనసేన కూటమిదే విజయం : నాయకర్‌

నరసాపురం రూరల్‌, మార్చి 5: అధికార పార్టీ ఎన్ని హామీలు, తాయిలాలు పంపిణీ చేసినా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిదే విజయమని జనసేన కన్వీనర్‌ బొమ్మిడి నాయకర్‌ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం తూర్పుతాళ్ళు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలందించారు. జక్కం బాబ్జ, ఆకన చంద్రశేఖర్‌, కోటిపల్లి వెంకటేశ్వరావు, గోపికృష్ణ, డాక్టర్‌ కోటేశ్వరరావు, వలవల నాని, రవీంద్ర, మార్రాజు, గంటా కృష్ణ, రావూరి సురేష్‌, కడలి పద్మారావు, పులపర్తి రాంబాబు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

బీసీల రక్షణ చట్టం చరిత్రాత్మకం : ఆరిమిల్లి

తణుకు, మా ర్చి 5: బీసీ రక్షణ చట్టం తేవడం చరిత్రాత్మకమని టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళ వారం తేతలిలో సకల జనుల చైతన్య పాదయాత్ర ప్రారంభించారు. మంగళగిరిలో జయహో బీసీ కార్యక్రమం విజయవంతం కావడం బీసీల్లో ఉన్న సానుకూలతకు నిదర్శనమన్నారు. బీసీ డిక్లరేషన్‌ విడుదల చేసిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తేతలిలో ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్ర పైడిపర్రు మీదుగా మండపాక చేరుకుంది. టీడీపీ, జనసేన నాయకులు బసవ రామకృష్ణ, పితాని మోహన్‌, కలగర వెంకట కృష్ణ, పరిమి వెంకన్నబాబు, దిడ్ల రవి, కొండేటి శివ, అడ్డాల శ్రీనివాసరాజు, మట్టా వెంకట్‌, మోపిదేవి శివ, ఆత్మకూరి రామకృష్ణ, పెండ్యాల యల్లపరాజు, బాలత్రిపుర సుందరి పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని సాగనంపాలి : ఇందుకూరి

గణపవరం, మార్చి 5: రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపాలని గణపవరం మండల టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు ప్రజలను కోరారు. పిప్పరలో టీడీపీ ప్రకటించిన సూపర్‌ 6 పథకాల వివరాలను ఇంటిం టా ప్రచారం చేశారు. కార్యక్రమంలో జీ.బాబురావు, ఇందుకూరి మురళీరాజు, ఇందుకూరి రమేష్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:23 AM