15న అన్నక్యాంటీన్లు ప్రారంభం : ఎమ్మెల్యే అంజిబాబు
ABN , Publish Date - Aug 09 , 2024 | 12:03 AM
పేదలకు కడుపునిండా భోజనం పెట్టాలనే తలంపుతో అన్నక్యాంటీన్లు ప్రారంభిస్తే వాటిని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు విమర్శించారు.
భీమవరం టౌన్, ఆగస్టు 8 : పేదలకు కడుపునిండా భోజనం పెట్టాలనే తలంపుతో అన్నక్యాంటీన్లు ప్రారంభిస్తే వాటిని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు విమర్శించారు. భీమవరంలోని బుధవారం మార్కెట్, పాత బస్టాండ్, జేపీ రోడ్డులోని అన్న క్యాంటీన్లు గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈనెల 15న అన్ని చోట్ల అన్నక్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం భీమవరంలో మూడు అన్నక్యాంటీన్లు సుమారు రూ .25 లక్షలతో అన్ని ఏర్పాట్లు చేశామని, రూ.5 లకే పేదవారికి భోజనం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, వబిలిశెట్టి రామకృష్ణ, గాదిరాజు తాతరాజు, రాట్నాల శ్రీనివాసరావు, కొప్పినిడి బాబి, చల్లా రాము, ఉప్పులూరి చంద్రశేఖర్, చిక్కాల వెంకటేశ్వ రరావు,నల్లం గంగాధర్‌రావు యనమదుర్రు నాగులు, ఎంఈ త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.