నిలిచిన సేవలు
ABN , Publish Date - Jun 18 , 2024 | 12:17 AM
ప్రభుత్వం మారడంతో రాష్ట్రస్థాయిలో వివిధ విభాగాలు, శాఖల సర్వర్‌లలో మార్పులు చేస్తున్నారు. ఈ పరిణామం తో మీ–సేవ, సచివాలయాల సేవలు అన్ని నిలిచి పోయాయి.
మీసేవ, సచివాలయాల్లో ఆగిన సర్వర్‌లు
రాష్ట్రస్థాయిలో అప్డేట్ చేస్తున్న ప్రభుత్వం
మరో మూడురోజులు ఇంతే..
ఏలూరు రూరల్, జూన్ 17 : ప్రభుత్వం మారడంతో రాష్ట్రస్థాయిలో వివిధ విభాగాలు, శాఖల సర్వర్‌లలో మార్పులు చేస్తున్నారు. ఈ పరిణామం తో మీ–సేవ, సచివాలయాల సేవలు అన్ని నిలిచి పోయాయి. గత కొద్దిరోజు లుగా ఇదే పరిస్థితి. మరో మూడు రోజుల్లో పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని జిల్లా అధికారులు వెల్లడిస్తు న్నారు. రెవెన్యూశాఖకు సంబంధించి ఎటువంటి ఫైళ్ళు మార్పు చేయరాదం టూ ఆదేశాలు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో ఐటీ సెల్‌లో అప్డేట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు కావాల్సిన వన్(బీ) అడంగల్ వంటి పత్రాలు అందడం లేదు. విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువ పత్రాలకు దరఖాస్తు చేసుకోలేకపోతు న్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లోనే ఉండి పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా మీసేవ, సచి వాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. రెవెన్యూ కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయడం లేదు. ఒకటి, రెండుచోట్ల కాదు, జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రైతులు మీ భూమి ద్వారా 1(బీ), అడంగల్ (బీ) పొంది తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. మరో వైపు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ రుణాలు రెన్యువల్, కొత్త రుణాలు పొందాలంటే చాలా బ్యాంకు లు, తహసీల్దార్లు డిజిటల్ సంతకంతో కూడిన 1(బీ) అడుగుతున్నారు. అవి తీసుకోవాలంటే సర్వర్లు పని చేయడం లేదు. మీ భూమి ద్వారా తీసుకుంటున్న 1(బీ)లతో రుణాలను రెన్యువల్ చేయా లని రైతులు కోరుతున్నారు.
విద్యార్థుల పాట్లు
విద్యార్థులు మీసేవ, సచివాలయాల చుట్టూ కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం ప్రద క్షిణాలు చేస్తున్నారు. సర్వర్ నిలిచిపోవడంతో విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో కుల, ఆదాయ ధ్రువపత్రాలు విద్యార్థులకు తప్పనిసరి. గత మూడునెలలుగా రెవెన్యూ సేవలు ఎన్నికల కారణంగా నిలిచిపోవడంతో విద్యార్థులు, రైతులు తీవ్రంగా ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ధ్రువ పత్రాలు మ్యాన్‌వెల్లో కూడా ఇవ్వక పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. మరో మూడురోజుల పాటు సర్వర్లు పనిచేయవని, అధికారులు స్పష్టం చేశారు.