Share News

అర్హులందరికీ ఇళ్లు

ABN , Publish Date - Sep 29 , 2024 | 12:09 AM

అర్హులందరికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని, గృహనిర్మాణాలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌ అధికారులకు సూచించారు.

అర్హులందరికీ ఇళ్లు
వేములపల్లి గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌

లింగపాలెం, సెప్టెంబరు 28: అర్హులందరికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని, గృహనిర్మాణాలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. వేములపల్లిలో శనివారం జరిగిన మన ఇల్లు – మన గౌరవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదల గృహ నిర్మాణ పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా గ్రామాల్లో సదస్సు లు నిర్వహించాలన్నారు. పేదలు సొంత ఇంటిని కలిగి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతిఒక్కరూ మార్చి నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. ఎంపీడీవో కె.వాణి, సర్పంచ్‌ నత్తా దివ్య దీప్తి, గరిమెళ్ళ చలపతిరావు, బలుసు శ్రీనివాసరావు, మోరంపూడి మల్లికార్జు నరావు, బలుసు శ్రీనివాసరావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

పెదవేగి: పేదల సొంతింటి కల సాకారం దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని లక్ష్మీపురం సర్పంచ్‌ మేకా కనకరాజు సిబ్బందికి సూచించారు. లక్ష్మీపురంలో జరిగిన సమావేశంలో సర్పంచ్‌ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్షపాత ధోరణీతో వ్యవహరించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఇంటిని నిర్మించు కోడానికి అనువుగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. రుణం మం జూరైన లబ్ధిదారులకు నిర్మాణాలకు అనువుగా బిల్లులు చెల్లించాలని, అప్పుడే నిర్మాణాల్లో మరింత వేగం ఉంటుందని ఆయన వివరించారు. గృహ నిర్మాణ శాఖ ఏఈ షాన్వాజ్‌ షరీఫ్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

చింతలపూడి: స్థానిక మార్కెట్‌ యార్డు ఆవరణలో మన ఇల్లు–మన గౌరవం కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇన్‌చార్జి మునిసిపల్‌ కమిషనర్‌ శారద ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు సీహెచ్‌. ధర్మరాజు, కొత్తపూడి శేషగిరిరావు, టి.అప్పారావు, రామారావు పాల్గొన్నారు.

టి.నరసాపురం: అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నల్లూరి వెంకట చలపతిరావు అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మన ఇల్లు–మన గౌరవం గ్రామసభలు నిర్వహించారు. టి.నరసాపురం, వెలగపాడు, రాజుపోతేపల్లి, బొర్రంపాలెం, బండివారిగూడెం, ఏపీగుంట వంటి గ్రామపంచాయతీల్లో పలుచోట్ల నిర్వహించిన గ్రామసభల్లో సర్పంచ్‌లు, నాయకులు పాల్గొని మాట్లాడారు.

Updated Date - Sep 29 , 2024 | 12:09 AM