Share News

నిలిచిన రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:48 PM

భూములు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో రిజిస్ట్రేషన్‌ శాఖ తరచూ పెడుతున్న నిబంధనలతో కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

నిలిచిన రిజిస్ట్రేషన్లు

రీ సర్వే అయిన గ్రామాల్లో కక్షిదారుల పాట్లు

భూముల ఎల్‌పీ నెంబరుతో బొప్పి..

ప్రభుత్వానికి భారీగా తగ్గిన ఆదాయం

ఆచంట, ఏప్రిల్‌ 6 : భూములు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో రిజిస్ట్రేషన్‌ శాఖ తరచూ పెడుతున్న నిబంధనలతో కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా జిల్లాలో రిజిస్ట్రేషన్ల లావాదేవీలు తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ భూములకు సంబంధించి భూముల రీ సర్వే విధానం రిజిస్ర్టేషన్‌ శాఖకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ర్టేషన్‌లు చేసుకోలేక తంటాలు పడుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం చేపడు తోంది. భూముల రీసర్వే పేరుతో మెలికలు పెడుతోంది. సర్వే నెంబర్లు ఉన్నచోట ల్యాండ్‌ పార్సిల్‌(ఎల్‌పి) నెంబర్లు ఇస్తోం ది. అవి రెవెన్యూ రికార్డుల్లో నమోదవుతున్నాయి. కానీ రిజి స్ర్టేషన్‌ చేయాలంటే ఎల్‌పి నెంబర్‌ ఉన్న భూమికి మార్కెట్‌ విలువను నిర్ధారించాలి. ఇప్పటి వరకు సర్వే నెంబర్ల ప్రకా రమే రిజిస్ర్టేషన్‌ ధరను నిర్ణయించారు. రీ సర్వేలో భాగంగా సర్వే నెంబర్‌లకు బదులుగా ఎల్‌పి నెంబర్లు ఇస్తున్నారు. వాటికి రిజిస్ర్టేషన్‌ విలువను నిర్ధారించాలి. అంటే కమిటీలు ఆమోదం తెలపాలి. ఆ తర్వాత కలెక్టర్‌ అనుమతించాలి. అప్పుడే ఎల్‌పి నెంబర్‌లతో రిజిస్ర్టేషన్‌లకు వీలుంటుంది. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఎల్‌పి నెంబర్‌లు ఇచ్చేశారు. కానీ రిజిస్ర్టేషన్‌ ధరను నిర్ధారించలేదు. దీంతో రిజిస్ర్టేషన్‌లు సాగడం లేదు. ఉదాహరణకు ఆచంట సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో ఆచంట, పెనుగొండ, పోడూరు మండలాల్లోని 20 గ్రామాలు ఉన్నాయి. కొడమంచిలి, కరుగోరుమిల్లి, పెనుమంచిలి, రావిపాడు, మినిమించిలిపాడు, ములపర్రు గ్రామాలకు సంబంధించి రీ సర్వే నెంబర్లకు ఎల్‌పీ నెంబరు కేటాయించడంతో ఈ గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. ఇక్కడ భూములు అమ్మాలన్నా, ఇంటిలో వారికి సెటిల్‌మెంటు దస్తావేజు రావాలన్నా, పెళ్ళి దస్తావేజులు రాయాలన్నా రిజిస్ట్రేషన్‌లు జరగడం లేదు. దీని కారణంగా ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ తగ్గిపోయింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ ఐదు గ్రామాలకు సంబంధించి ఎల్‌పీ నెంబర్లు కేటాయించడంతో కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆచంటలోనే కాదు. అన్ని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలోనూ నాలుగు నుంచి ఐదు గ్రామాలకు రీ సర్వే పూర్తి చేస్తున్నారు. ఎల్‌పి నెంబర్‌లు కేటాయిస్తున్నారు. దీంతో అక్కడ రిజిస్ర్టేషన్‌ ధరను నిర్ణయించడానికి సమయం పడు తోంది. ఫలితంగా రిజిస్ర్టేషన్‌లు నిలచిపోతున్నాయి. కక్షిదారులు రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. రీ సర్వేలో సర్వే నెంబర్‌లకు బదులుగా ఎల్‌పి నెంబ ర్లు ఇవ్వడంతోనే ఇటువంటి సమస్య ఎదురవుతోంది. భూము ల రిజిస్ర్టేషన్లు నిర్వహించలేకపోతున్నారు. యజమానులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:48 PM