Share News

నామినేటెడ్‌ నజర్‌

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:23 AM

ఎన్నికల రణంలో తెగించి సొంతపార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో నిద్రా హారాలు మాని, పోరాడిన కార్యకర్తలు ఎవరు. అక్రమ కేసులకు వెరవకుండా, నిందారోపణలు లెక్కచేయకుండా జెండానే.. మా అజెండాగా భావించిన నేతలు ఎవరు.. గత అనుభవాలను నెమరవేసుకుని త్యాగాలకు వచ్చి, వైసీపీ అక్రమాలకు అడ్డుకట్టవేసి ప్రాణాలకు తెగించి పార్టీని నిలబెట్టిన వారందరికి కూటమి నాయకత్వం త్వరలోనే ‘కృతజ్ఞత’ చెప్పబోతోంది.

నామినేటెడ్‌ నజర్‌

క్షేత్రస్థాయి కార్యకర్తలకు త్వరలో ఛాన్స్‌

నియోజకవర్గాల వారీగా కసరత్తు

మూడు నెలల్లోనే పెనుమార్పుకు సిద్ధం

ఈలోపే నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారిని తప్పించేలా ఆదేశాలు

ఎన్నికల రణంలో తెగించి సొంతపార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో నిద్రా హారాలు మాని, పోరాడిన కార్యకర్తలు ఎవరు. అక్రమ కేసులకు వెరవకుండా, నిందారోపణలు లెక్కచేయకుండా జెండానే.. మా అజెండాగా భావించిన నేతలు ఎవరు.. గత అనుభవాలను నెమరవేసుకుని త్యాగాలకు వచ్చి, వైసీపీ అక్రమాలకు అడ్డుకట్టవేసి ప్రాణాలకు తెగించి పార్టీని నిలబెట్టిన వారందరికి కూటమి నాయకత్వం త్వరలోనే ‘కృతజ్ఞత’ చెప్పబోతోంది. అర్హత కలిగిన నామినేటెడ్‌ పోస్టుల్లో నియమించాలని కూటమి నాయకత్వం తలపోస్తోంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఐదేళ్లపాటు జగన్‌ ప్రభుత్వంలో అక్రమ కేసులకు ఎదురొడ్డి పార్టీ కోసం నిలబడ్డ సాధారణ కార్యకర్తలకు పదవులు ఇచ్చి గౌరవించాలని భావిస్తున్నారు. ఐదేళ్లలో కులాల వారీగా కార్పొరేషన్‌లు ఏర్పాటుచేశారు. చైర్మన్‌ లు, పాలక సభ్యులను నియమించారు. ఎంతసేపటికి రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నియామకాలన్నీ సాగాయి. రాజ కీయ నిరుద్యోగతను దృష్టిలో పెట్టుకుని కులానికో కార్పొరేషన్‌ ఏర్పాటుచేశారు. పాలక మండలిని ఏర్పాటుచేశారు. గౌరవ వేతనం ఇచ్చారు. కొన్నింటికి కార్యాలయాలు పెట్టి సిబ్బందిని నియమించి హంగామా చేశారు. ఇదేదో తమ సామాజికవర్గ అభివృద్ధికి పనికి వస్తుందని కొత్తలో అంతా భావించారు. ఎడాపెడా నామినేటెడ్‌ పోస్టులన్ని భర్తీ చేశారు. ఉమ్మడి పశ్చిమలో వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్‌ పదవి దక్కిన వారు ఉన్నా రు. సాహిత్య అకాడమి చైర్మన్‌గా పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుబ్బల తమ్మయ్య, ఈడా చైర్మన్‌గా కొన్నాళ్ళపాటు ఎంఆర్డీ ఈశ్వరిని, ఏలూ రు స్మార్ట్‌ సిటీ చైర్మన్‌గా మరొకరిని, వడ్డీల కార్పొరేషన్‌ ఇంకొకరిని, ఆక్వా అథారిటీ చైర్మన్‌గా రఘురామ్‌ను, ఎంబీసీ చైర్మన్‌గా పెండ్ర వీరన్నను నియమించారు. క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌గా పలువురిని గత ప్రభుత్వంలో నియమిం చారు. వాస్తవానికి వీరి నియామకం తర్వాత జిల్లాలో అయా వర్గాలకు అదనపు సంక్షేమం జరిగితే ఒట్టు. కార్పొరేషన్‌ల న్నింటిని నామినేటెడ్‌ పదవులతో నింపేశారే తప్ప వాటి మనుగడకు అవసరమైన మార్గ నిర్దేశాన్ని చేయలేకపోయారు. గౌరవ వేతనాలు ఇచ్చే వేదికలుగా అవకాశం ఇచ్చారు. వైసీపీ విజయానికి అప్పట్లో కష్టపడినందుకు జగన్‌ ప్రభుత్వం చైర్మన్‌గా నియమించి కొందరికి కృతజ్ఞత తెలిపింది. ఈ ఐదేళ్లు వీరంతా ఏమీ చేయలేక నిస్సహాయం గా మిగిలి పోయారు. ఏలూరు స్మార్ట్‌సిటీ చైర్మన్‌ పదవికి కొన్నాళ్ళపాటు చైర్మన్‌గా నియమించి ఆ తర్వాత ఆ ఒక్కర్ని పదవి నుంచి తొలగించారు. నియమ నిబంధన లకనుగుణంగా ఆ పదవి లేకపోవడమే కారణం. ఈడా చైర్మన్‌గా నియమించి కొన్నాళ్ళ పాటు ఇంకొకరికి ఆ పదవి ఇచ్చేందుకు చివరిలోనూ ప్రయ త్నించారు. ఇవన్ని అప్పట్లో అధికార వైసీపీలోనే కొత్త గందర గోళానికి దారి తీశాయి. వైసీపీ భావించినట్టు ఎన్నికల సమ యంలో వీరందరి నుంచి పెద్ద ఎత్తున ఓట్లు పొందలేదు సరి కదా, నామమాత్రంగా వీరిప్రభావం పడలేదు. కారణం.. అధికార వైసీపీలో ఏకపక్ష విధానం, జగన్‌ అంతా తానే వ్యవహరించడం, అధికారుల మాట వినకపోవడం, వలంటీర్ల పెత్తనం పెరగడం.. ఇవన్ని కలిసొచ్చి వైసీపీ పతనానికి దారి తీశాయి. ఈ గందరగోళం వ్యవహారాన్ని కూటమి నాయకత్వం సమీక్షించబోతోంది. ఎక్కడికక్కడ నామినేటెడ్‌ పోస్టుల్లో ఇప్పటికే ఉన్న వారందరిని రాజీ నామాలు చేస్తూ వైదొలగా ల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. సాధారణంగా ప్రభుత్వం మారిన వెంటనే నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్నవారంతా రాజీనా మాలు చేసి తమ నైతికత ప్రదర్శిస్తారు. ఇప్పటికే కొందరు వైసీపీ అనుకూలురు నా మినేటెడ్‌ పోస్టులకు రాజీ నామాలు చేస్తే ఇంకొం దరు అంటి పెట్టుకుని ఉన్నారు. వీరందర్ని పూర్తి గా తొలగించి ఆ తదుపరి కూటమి పక్షాన కష్టపడిన వారందరికి అవకాశం ఇవ్వను న్నారు.

ఈడా ఎవరి సొంతం ?

2014లో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ అప్పట్లోనే పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ తీసుకుంది. దీనిలో భాగంగానే ఏలూరు అర్బన్‌ అథారిటీ ఏర్పాటైంది. తొలి చైర్మన్‌గా ఉప్పాల జగదీష్‌బాబు నియమితులైన కొద్దికా లానికే తెలుగుదేశం అధికారం కోల్పోయింది. ఆ తదు పరి అధికారంలోకి వచ్చిన వైసీపీ తొలుత ఎమ్‌ఆర్డీ ఈశ్వరిని ఈ పదవిలో నియమించింది. ఆ తదుపరి బొద్దాని శ్రీనివాస్‌ను నియమించారు. దీంతో వైసీపీలో కొంత వివాదం చోటు చేసుకుని ఆ పార్టీ నుంచి ఎమ్‌ ఆర్డీ బలరామ్‌ బయట పడ్డారు. ఈసారి ఆయన టీడీపీ విజయానికి కష్టపడి పని చేశారు. తిరిగి అదే పదవి తన కుటుంబానికి వచ్చేలా చూడా లని ఆయన కోరుతున్నారు. ఏలూరు కేంద్రంగా పనిచేసిన వారిని మాత్రమే ఈ అవకాశం దక్కే పరిస్థితి ఉండడంతో టీడీపీ నేతలంతా ఇప్పుడు టెన్షన్‌ ఫీలవుతున్నారు. కీలకమైన ఈడా చైర్మ న్‌ పదవి కోసం కొద్ది రోజుల్లోనే మరికొద్దిమంది రంగం లోకి దిగే అవకాశం లేకపోలేదు.

మిత్రపక్షాలపై త్వరలో స్పష్టత

నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో మిత్రపక్షాలకు చోటు ఇవ్వాలా? లేదా? అనే దానిపైన కీలక నిర్ణయం తీసుకో వాల్సి ఉన్నందున రాబోయే మూడు నెలల్లో వీటి కస రత్తు మరింత వేగమయ్యే అవకాశం ఉన్నాయి. తొలుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా నామినేటెడ్‌ పోస్టుల సంఖ్య సమాంతరంగా ఈ పదవు లను ఆశిస్తున్న వారి సంఖ్య పరిగణనలోకి తీసుకుని అందరికి ఆమోదయోగ్యమైన జాబితాలను వెలువరించే దిశగా ఈ లోపే సుదీర్ఘ కసరత్తు జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి బీసీ వర్గాలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చానాళ్ళుగా డిమాండ్‌ ఉంది. ఉమ్మడి జిల్లాలో వైసీపీకి స్థానం లేకుండా పోవడం, కూటమి పూర్తిగా చేజిక్కించుకోవడంతో నామినేటెడ్‌ పోస్టులన్ని కూటమి పరం కాబోతున్నాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే నేరుగా ఆయా నియోజకవర్గాల్లో నామినే టెడ్‌ చేసే అధికారం ఉంటుంది. ఇప్పుడు ఏకపక్షంగా కూటమి అధికారంలోకి రావడంతో వివిధ నామినేటెడ్‌ పోస్టుల్లో ఇంతకు ముందు అడ్డదారిన వచ్చే సిఫార్సుల మేరకే కొంత మందిని నియమించినా ఇప్పుడు ఆ తరహా తప్పులేమి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అరాచకానికి, అక్రమ కేసులకు, ఒత్తిళ్ళకులోనైన వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమ గెలుపునకు కారణ మైన కొంత మందికి ఏదో ఒక నామినేటెడ్‌ పోస్టు ఇప్పించేలా చూస్తానని భరోసా ఇచ్చినందున వారి విషయాన్ని తొలుత పరిగణలోకి తీసుకోబోతున్నారు.

మార్కెట్‌ కమిటీలకు పోటీ

నియోజవకర్గాల్లో ఎమ్మెల్యేతోపాటు పూర్తి ప్రొటోకాల్‌ పరిధిలోకి వచ్చేది మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లే. వ్యవసా య మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అయ్యేందుకు ఆ మేరకు నామి నేటెడ్‌ దక్కించుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే సిఫా ర్సులే కీలకంగా ఉండేవి. కాని, కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే సిఫార్సులకు విలువ ఇస్తూనే పార్టీలో కష్టించి పనిచేసిన సాధారణ కార్యకర్తలకూ తగిన ఛాన్స్‌ ఇవ్వాలని భావిస్తు న్నారు. దీనికి తగ్గట్లు క్షేత్రస్థాయిలో ఎవరె వరు ఏ ఏ స్థాయిల్లో కష్టపడింది ? జాబితాలు తయా రవుతున్నాయి. కీలక మార్కెట్‌ యార్డుల్లో చైర్మన్‌లుగా వున్న వారిలో కొంత మంది రాజీనామాలకు సిద్ధపడి ఆ పోస్టులను ఖాళీ చేస్తున్నారు. రాబోయే మూడు నెల ల కాలంలోనే ఈ పదవులన్నింటిని భర్తీ చేసే అవకా శాలు ఉన్నాయి.

Updated Date - Jun 09 , 2024 | 12:23 AM