Share News

పొరుగు రాష్ట్రాల మద్యం స్వాధీనం

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:21 AM

అరుణాచల ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లు అక్ర మంగా దిగుమతి చేసు కున్నారని ఇద్దరు వ్యక్తులను తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

పొరుగు రాష్ట్రాల మద్యం స్వాధీనం
పట్టుబడిన మద్యంతో పోలీసులు

తణుకు, మార్చి 11 :అరుణాచల ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లు అక్ర మంగా దిగుమతి చేసు కున్నారని ఇద్దరు వ్యక్తులను తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సోమ వారం ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ వద్ద విలే కరుల సమావేశంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి వివరాలను వెల్లడించారు. అరుణా చల్‌ప్రదేశ్‌ మద్యంతో తణుకు డంపింగ్‌ యార్డుకు వెళ్ళే ఖాళీ ప్రదేశఽంలో ఉన్న ఉండ్రాజవరం మండలం కె.సావరం గ్రామానికి చెందిన బోయిన బాలాజీ, రాజమహేంద్రవరానికి చెందిన తుమ్మల రాధాకృష్ణలను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 220 మద్యం బాటిళ్ళు, కారు, ఆటోతో పాటు ఆరువేల నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు. ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామానికి చెందిన ఇజ్జాడ పాపినాయుడు, అత్తిలి మండలం ఉరదాళ్ళపాలెంకు చెందిన మాకా రాజేష్‌, ఇరగవరం మం డలం ఇల్లింద్రపర్రుకు చెందిన గండ్రోతులు యేసుబాబులు పరారీలో ఉన్నా రని చెప్పారు. పట్టణ సీఐ నాగరాజు, ఎస్‌ఐ కె.శ్రీనివాసు, పీసీలు జి.శ్రీనివాసు, టి.రవి, ఎస్‌కె అక్బర్‌లాల్‌, ఆర్‌ఎండీవీ ప్రసాదు, డి.వెలగేల శ్వరరావు, ఎంపీ శివాజీ, జి.మురళీలను అభినందించారు.

Updated Date - Mar 12 , 2024 | 12:21 AM