న్యాయవాదుల నిరసన
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:35 PM
కొత్త క్రిమినల్ చట్టాలు నిలుపుదల చేయాలని కోరుతూ కోర్టు వద్ద ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు.

తణుకు, జూలై 5: కొత్త క్రిమినల్ చట్టాలు నిలుపుదల చేయాలని కోరుతూ కోర్టు వద్ద ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. కరోనా సమయంలో ఎలాంటి చర్చ జరపకుండా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి క్రిమినల్ చట్టాలను బీజేపీ ఆమోదించిందని ఆరోపిస్తూ వెంటనే కొత్త చట్టాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. పౌర హక్కుల సంఘం నాయకుడు కౌరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పి. ప్రతాప్‌కుమార్, విక్టర్ బాబు పాల్గొన్నారు.