టీడీపీతోనే ముస్లింల అభివృద్ధి
ABN , Publish Date - Mar 22 , 2024 | 12:37 AM
టీడీపీతోనే ముస్లింల అభివృద్ధి సాధ్యమని నూజివీడు కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు.
నూజివీడు కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే పార్థసారథి
ఆగిరిపల్లి, మార్చి 21: టీడీపీతోనే ముస్లింల అభివృద్ధి సాధ్యమని నూజివీడు కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం ఆగిరిపల్లిలో ముస్లిం సోదరులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సాయంత్రం ప్రార్థన సమయానికి ముందు బస్టాండు వద్ద గల చిన్నమసీదులో ప్రార్థనలో పాల్గొన్నారు. పెద్దమసీదు సమీపంలో ఉన్న షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వం ముస్లింలకు సాయం చేసినట్టు ఏ ప్రభుత్వమూ చేయలేద న్నారు. రంజాన్ తోఫా అనే కార్యక్రమం టీడీపీ పాలనలోనే అమలయిందన్నారు. ఇప్పటివరకు పెనమలూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ముస్లింలకు ఎంతో సాయం చేశానని, అక్కడ ఒక ఏసీ మసీదు కట్టిస్తున్నానన్నారు. ఆగిరిప ల్లి పెద్దమసీదు బాగా పాడైపోయిందని ముస్లింలు తెలుపగా టీడీపీ ప్రభుత్వం రాగానే రూ.50 లక్షల నిధులను మంజూరు చేయిస్తానని, తన సొంత నిధుల నుంచి రెండున్నర లక్షల నిధులు ఇస్తానని, నూజివీడులో కూడా ఈద్గా కట్టిస్తా నని హామీ ఇచ్చినట్టు తెలిపారు. మసీదు కమిటీ ప్రెసిడెంట్ చాన్‌భాషా మాటా ్లడుతూ జగన్ ప్రభుత్వం బీజేపీని బూచిగా చూపించి తమ ఓట్లు దండుకుం దామని చూస్తుందని, నిజమైన సెక్యులర్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబు లౌకిక వాది అని ముస్లిం ఓట్లు ఎప్పుడూ చంద్రబాబుకే ఉంటాయని తెలిపారు. అనంతరం జరిగిన ఇఫ్తార్‌లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు చాన్ బాషా, ఎస్.ఎస్ బాబు, సగ్గుర్తి రమేష్, మడుపల్లి గోపాల్, చిట్నేని శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.