Share News

కొల్లేరు ఘోష

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:57 AM

తాము అధికారంలోకి వస్తే మీ బతు కులను మార్చేస్తామంటూ గత ఎన్నికల సమయంలో జగన్‌ హామీలు కురిపించారు. అదంతా నమ్మి ఓట్లేసిన ప్రజలను నడికొల్లేరులో వదిలేశారు.

 కొల్లేరు ఘోష

తాము అధికారంలోకి వస్తే మీ బతు కులను మార్చేస్తామంటూ గత ఎన్నికల సమయంలో జగన్‌ హామీలు కురిపించారు. అదంతా నమ్మి ఓట్లేసిన ప్రజలను నడికొల్లేరులో వదిలేశారు. కనీసం పొట్ట కూటి కోసం వలసలు వెళుతున్న కూలీలను నివా రించడంలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. అధికారంలోకి వచ్చి తర్వాత గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా కొల్లేరు ప్రజల సమస్యల వైపు కన్నెత్తి చూడలేదు. ఇచ్చిన హామీలను సైతం నెర వేర్చకుండా జగన్‌ ప్రభుత్వం గాలి కొదిలేసింది.

కైకలూరు, ఏప్రిల్‌ 24 : కొల్లేరు మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు లేకపోవడంతో వేలాది కుటుం బాలు కొల్లేరును వదిలి కర్ణాటక, మహారాష్ట్ర, నాందేడ్‌, నెల్లూ రు, ఒంగోలు, గద్వాల్‌ వంటి ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని వలసలు పోయారు. అక్కడ కూడా సరైన ఉపాధి లేక నిత్యం దినదిన గండంగానే జీవితాలు సాగిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పఽథకాలను సైతం తుంగలో తొక్కి ప్రజల జీవనోపాధిని దెబ్బతీశారు. గత ప్రభుత్వ హయాంలో ఏటా మత్స్యకారులకు కొల్లేరు స్పెషల్‌ స్కీం కింద రూ.210 కోట్లతో వారి సంక్షేమానికి కృషి చేసింది. ఫిషరీస్‌ డెవలెప్‌మెంట్‌ స్కిల్‌ ద్వారా రుణాలను అందించింది. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా మత్స్యకారులకు బైకులు, ఆటోలు, ఫోర్‌వీలర్‌ వాహనా లను సబ్సిడీపై అందించింది. బ్లూరీ వెల్యూషన్‌ పఽథకం ద్వారా 90 శాతం సబ్సిడీపై కొల్లేరులోని 152 మంది మత్స్యకార కుటుంబాలకు వెదురుగెడలు, వలలు కొనుగోలు చేసుకునేందుకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. జగన్‌ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకాలన్ని మూతపడి ప్రజలకు ఎలాంటి ఉపాధి లేకుండాపోయింది. కొల్లేరు పరిధిలోని ఏ వైసీపీ ఎమ్మెల్యే కొల్లేరు సమస్యలను చట్టసభల్లో లేవనెత్తలేదు. జిల్లాలోని కొల్లేరు నుంచి సుమారు 6,136 కుటుంబాలు వల సలు వెళ్లిపోయారు. అత్యధికంగా కైకలూరు మండలం శృంగ వరప్పాడులో 560 కుటుంబాలు పొరుగు రాష్ట్రాల్లో జీవిస్తు న్నాయి. పిల్లలను, వృద్ధులను ఇళ్లవద్ద వదిలేసి పొరుగు రాష్ట్రా ల్లో కూలి పనులు చేసుకొని వచ్చే అరకొర డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యాలకు గురైనా ఆస్పత్రికి తీసుకువెళ్ళే దిక్కు లేక వృద్ధులు పడుతున్న వేదన వర్ణనాతీతం. కొల్లేరు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రజలకు ఉపాధి కల్పిస్తామని వరాల జల్లులు కురిపించిన వైసీపీ ప్రభుత్వం విఫలమైంది.

రెగ్యులేటర్‌ నిర్మాణం ఊసే లేదు..

కొల్లేరు సరస్సులో నీటి నిల్వలు పెంచి మత్స్యకారులు చేపలు వేట చేసుకుని జీవించేందుకు రెగ్యులేటర్‌ నిర్మాణం చేస్తామని జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికల్లో ప్రజలకు వరాలజల్లు కురిపిం చారు. అధికారంలోకి వచ్చాక ఏయే ప్రాంతాల్లో రెగ్యులేటర్‌ నిర్మాణం చేయాలో చర్చించకుండా గాలికొదిలేశారు. కొల్లేరు పరిఽ దిలో ఐదు నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యేలున్నా కొల్లేరు ప్రజల సంక్షేమం, రెగ్యులేటర్‌ నిర్మాణం పట్టించుకోలేదు.

పేరుకే వడ్డీ కార్పొరేషన్‌

జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో కొల్లేరు అభివృద్ధి కోసం ఆ గ్రామాల్లో నివసించే వడ్డీలకు లబ్ధి చేకూరుస్తామంటూ వడ్డీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయగా చైర్మన్‌గా కైకలూరు మండలం శృంగవరప్పాడుకు చెందిన సైదు సంతోషి గాయత్రి మూడేళ్ల పాటు పదవీలో కొనసాగారు. కార్పొరేషన్‌ ద్వారా కూడా కొల్లేరు గ్రామాల్లో వడ్డీ కులస్తులకు ఏ విధమైన సంక్షేమం అందలేదు.

ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా..

కొల్లేరు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆ ప్రాంతా నికి చెందిన ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్మోహన్‌రెడ్డి టీడీపీ నుంచి జయమంగళ వెంకటరమణను వైసీపీలోనికి తీసుకుని ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. వారికి పదవి వచ్చి 14 నెలలు గడిచినా కొల్లేరు సమస్యలపై ఎక్కడా చర్చించిన దాఖాలులు లేవు.

కొల్లేరుకు అటానమస్‌ బోర్డు ఏర్పాటు చేయాలి

కొల్లేరు ప్రజారక్షణ సమితి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య డిక్లరేషన్‌

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 24 : కొల్లేరుకు అటానమస్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కొల్లేరు ప్రజారక్షణ సమితి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లా ఏలూరులో బుధవారం ఈ మేరకు సమావేశం నిర్వహిం చి కొల్లేరు వాసుల న్యాయమైన సమస్యలు, డిమాండ్లు పరిష్క రించాలని కోరుతూ డిక్లరేషన్‌ను రూపొందించారు. కొల్లేరు ఉద్యమ కారిణి ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల కొల్లేరు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పాట చిత్రీకరించి విడుదల చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం కొల్లేరు ఆక్రమణలు, అక్రమ చెరువులు తవ్వకాలు, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని, జీవనోపాధి కోల్పోయి అనేకమంది వలస వెళ్ళారని కొల్లేరుకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధి తో కృషిచేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కొల్లేరు ప్రజలు, పెద్దలతో కలిసి కొల్లేరు ప్రజలు పడుతున్న ఇబ్బం దులు, బాధలు తెలుసుకుని డిక్లరేషన్‌ను రూపొందించామని, కొల్లేరుకు అటానమస్‌ బోర్డు ఏర్పాటు చేయాలని తీర్మానించి నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష, అధికారపక్ష, ఇతర రాజకీయపార్టీ నాయకులను కలిసి కొల్లేరు సమస్యలను వారి మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరతామన్నారు. ప్రజా గాయని విమలక్క మాట్లాడుతూ మంచినీటి సరస్సుగా ఉన్న కొల్లేరు ఆక్రమణకు గురికావడంతో అనేకమంది వడ్డీలు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ, చేపలు, పక్షులు, మనుషులను రక్షించుకోవాలంటే కొల్లేరు అటాన్‌మస్‌ బోర్డు కావాలన్నారు. కొల్లేరు కాంటూరు కుదింపు విషయంలో కేంద్రం అశ్రద్ధ చేసిందని మండిపడ్డారు. కొల్లేరు డిక్లరేషన్‌ను నాయకులు ఆవి ష్కరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరీమ్‌ పాషా, ఏఐ ఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.నాగేంద్రరావు, కొండా దుర్గా రావు, పీవోడబ్ల్యూ నాయకురా లు గంగారత్నం, సుధాకర్‌, నాగరాజు, చందు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:57 AM