Share News

మత్తుతో జీవితాలు చిత్తు

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:17 AM

మత్తు పదార్థాల వలన జీవితం నాశనమవుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజ నేయులు (అంజిబాబు) అన్నారు.

మత్తుతో జీవితాలు చిత్తు
భీమవరంలో బ్రోచర్‌ను అవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు

ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామ

భీమవరం టౌన్‌, జూన్‌ 26 : మత్తు పదార్థాల వలన జీవితం నాశనమవుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజ నేయులు (అంజిబాబు) అన్నారు. శ్రీవిజ్ఞా న వేదిక ఆధ్వర్యంలో కేజీఆర్‌ఎల్‌ ఫార్మసీ కళాశాల విద్యార్థులతో బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు కార్యా లయంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించి వారోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కేజీఆర్‌ఎల్‌ కళాశాల వరకు ర్యాలీ నిర్వహిం చారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.రాఘవ, చెరుకు వాడ రంగసాయి, కోళ్ల నాగేశ్వరరావు, నల్లం చిట్టిబా బు, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ సాయి ఫణీంద్ర, ఉమా మహేశ్వరి, మోహన్‌ రూపా పాల్గొన్నారు.

ఆకివీడు : మాదక ద్రవ్యాల వ్యతిరేఖ దినోత్సవం సందర్భంగా నవజీవన బాల భవన్‌కు చెందిన లీలావతి ప్రచారంలో భాగంగా గుమ్ములూరులో ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. చంద్రబాబు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. ఈయన వెంట కూటమి శ్రేణులు ఉన్నారు.

పెంటపాడు : మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలని డీఆర్‌ గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వెంకటేశ్వరరావు అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు ప్రేమ్‌సాగర్‌, విజయ్‌బాబు, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

తణుకు : మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితాలను సుఖమయం చేసుకోవాలని డాక్టర్‌ కె.ఆనంద్‌ అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా కోర్టు ప్రాంగణంలో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ చదువుకునే వయస్సు నుంచే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకుంటున్నారు. న్యాయ వాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, ముప్పిడి సుబ్బయ్య, సత్యనారాయణ రాజు, అజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లు అర్బన్‌ : యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని ఏఎస్‌ ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.రాజ రాజేశ్వరి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ రాజ రాజేశ్వరి అధ్యక్షత వహించి మాట్లాడారు. పాలకొల్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, కళాశాల సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్‌ఈబీ సీఐ ఎస్‌కే భవానీ ముఖ్య అతిథిగా విచ్చేసి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్ధానలను వివరించారు. మాదక ద్రవ్య వ్యతిరేక కమిటీ కో కన్వీనర్‌ వంశీ, రసాయన శాస్త్ర విభాగం హెడ్‌ డాక్టర్‌ వి.యమిని, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్‌ కె.భద్రాచలం, ఎస్‌ఎస్‌ఎస్‌, అధ్యాపక, అద్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.

తాడేపల్లిగూడెం రూరల్‌ : యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి నిండు జీవితాలను నాశనం చేసుకుంటారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ మద్దాల శ్రీనివాసరావు అన్నారు. మాదక దవ్ర్యాల వ్యతిరేక దినం సందర్భంగా పట్టణంలోని ఆదిత్యా కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించి అనంతరం ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Jun 27 , 2024 | 12:17 AM