Share News

కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:37 AM

రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని డీసీసీబీ మాజీ చైర్మన్‌ కరాటం రాంబాబు పిలపునిచ్చారు.

కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి
కరాటం రాంబాబు సమక్షంలో జనసేనలో నాయకులు

డీసీసీబీ మాజీ చైర్మన్‌ కరాటం రాంబాబు

కొయ్యలగూడెం, ఏప్రిల్‌ 5: రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని డీసీసీబీ మాజీ చైర్మన్‌ కరాటం రాంబాబు పిలపునిచ్చారు. మండలంలోని పొంగుటూరు, కన్నాయిగూడెం, తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. పొంగుటూరులో సుమారు వంద మంది పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలన్న, అమరావతి పూర్తి కావాలన్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితోనే సాధ్యమన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంతో పాటు ఆంధ్రరాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఏలూరు ఎంపీ అ భ్యర్థి మహేష్‌యాదవ్‌, పోలవరం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజులను గెలిపించాలని కోరారు. జనసేన మండల అధ్యక్షుడు తోట రవి, దుగ్గిన శ్రీను, కొడవటి రామకృష్ణ, రాజనాల సత్యనారాయణ, గేలం భాస్కర్‌, టీడీపీ నాయకురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, మేకల తేజ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 12:37 AM