Share News

కైకలూరుకు కామినేని

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:51 AM

కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గా నికి కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ను ఎంపిక చేయడంతో మూడు పార్టీల నాయకులు బాణసంచా కాల్చి, మిఠాయిలను పంచుతూ కేక్‌ కట్‌ చేసి కామినేనికి అభినందనలు తెలిపారు.

కైకలూరుకు కామినేని
కామినేనిని అభినందిస్తున్న ముస్లింలు, అభిమానులు

బీజేపీ అభ్యర్థిగా బరిలోకి.. అభిమానుల సంబరాలు

కైకలూరు, మార్చి 27 : కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గా నికి కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ను ఎంపిక చేయడంతో మూడు పార్టీల నాయకులు బాణసంచా కాల్చి, మిఠాయిలను పంచుతూ కేక్‌ కట్‌ చేసి కామినేనికి అభినందనలు తెలిపారు. ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, పీజేఎస్‌ మాల్యాద్రి, ఎండీ జానీ, ఉస్మాన్‌, సయ్యద్‌ బాషీద్‌, రామకృష్ణ, పి.రాధాకృష్ణ, గంగుల శ్రీదేవి, జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్‌, తోట లక్ష్మి, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్‌ నుంచి మంత్రిగా..

కైకలూరు మండలం వరహాపట్నంలో పుట్టి పెరిగిన ఆయన ఎంబీబీఎస్‌ పూర్తి చేసి వైద్య వృత్తిని చేపట్టారు. ఆయన తల్లిదం డ్రులు రాజేశ్వరమ్మ, విజయసింహ భార్య మనోరమ, కుమారులు డాక్టర్‌ విజయ్‌గోపాల్‌తిలక్‌, వేణుగోపాల్‌ తిలక్‌, విమల్‌ కుమార్‌ విదేశాల్లో స్థిరపడ్డారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో టీడీపీలో చేరారు. అనతికాలంలోనే ఎమ్మెల్సీగా పదవి వరించింది. 30 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చేపల రైతుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడి గా పనిచేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం తరపున కైకలూ రు నుంచి పోటీ చేసి 972 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ఆయనకున్న సత్సం బంధాలతో 2014లో బీజేపీలో చేరి టీడీపీ–బీజేపీ పొత్తులో కైక లూరు నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్‌పై 21,570 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఐదేళ్ల కాలంలో రూ.730 కోట్లతో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశారు.

Updated Date - Mar 28 , 2024 | 12:51 AM