కైకలూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బొడ్డు నోబుల్
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:40 AM
కైకలూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొడ్డు నోబుల్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ప్రకటించారు.

కైకలూరు, ఏప్రిల్ 2: కైకలూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొడ్డు నోబుల్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో బ్లాక్–1 అధ్యక్షుడిగా, అనంతరం వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తనను చిన్నచూపు చూశారని మనస్ధాపం చెంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన నోబుల్‌కి టిక్కెటు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.