Share News

దేశ ప్రగతికి ఓటు కీలకం

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:30 AM

దేశ ప్రగతికి ఓటు కీలకమని ఆర్వో, జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేని అన్నారు. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు.

దేశ ప్రగతికి ఓటు కీలకం
లింగపాలెం మండలంలో వాహనాల తనిఖీ

దెందులూరు, మార్చి 27: దేశ ప్రగతికి ఓటు కీలకమని ఆర్వో, జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేని అన్నారు. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య ఆధ్వర్యంలో అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వంచారు. ఎన్ని కల నియామవళి ఉల్లంఘనపై ఫిర్యాదు అందిన అర్థగంటలోపు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, నూరు శాతం పోలింగ్‌కు అధికారులు కృషి చేయా లని ఆమె సూచించారు. అనంతరం తహసీల్దార్‌ జితేంద్రతో కలిసి సమా వేశం నిర్వహించారు. రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు లోను చేయకుండా నిఘా ఉంచాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పోలీస్‌, రెవెన్యూ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నిబంధనలు మీరితే చర్యలే

పెదవేగి: ఎన్నికల నిబంధనలు మీరితే చర్యలు తప్పవని తహసీల్దారు సూర్యప్రభ అన్నారు. పినకడిమి సచివాలయంలో ఎన్నికల ప్రవర్తనా నియ మావళిపై వివిధ రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల కోడ్‌ ఉన్నంత కాలంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. నలుగురికి మించి గుమి కూడి ఉండకూడదని, ప్రచారానికి ముందుగానే అనుమతి తీసుకోవాలన్నారు. వాహనాలపై స్టిక్కర్లు, జెండాలు, ఇంటిపైన రాజకీయపార్టీ జెండాల ఏర్పాటు కు అనుమతి తప్పనిసరి అన్నారు. నిబంధనలను అనుసరించి మాత్రమే నడుచుకోవాలని, రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లితో దానికి సరైన ఆధారాలు చూపించాలని, లేకుంటే నగదు సీజ్‌ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో సీఐ కొండవీటి శ్రీనివాసకుమార్‌, ఎస్‌ఐ వి.రాజేంద్రప్రసాద్‌, ఎంపీడీవో వెంకట రమణ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఎక్కువ మొత్తం నగదు ఉంటే సీజ్‌

లింగపాలెం: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రత్యేక బృందాలు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. బృందం ఇన్‌చార్జ్‌ జె.శాంతి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించి మద్యం, నగదు అక్రమ తరలింపుపై హెచ్చరికలు చేశారు. రూ.50వేలకు మించి నగదు తీసుకువెళ్లవలసి వస్తే సరైన పత్రాలు ఉంచు కోవాలన్నారు. మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టే ఇతర వస్తువులు తీసుకువెళితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలో పలు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ జయరాజు, బి.వి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:30 AM