Share News

హెచ్‌ఎం రుచి చూశాకే పిల్లలకు పెట్టాలి

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:09 AM

పాఠశాలల్లో బాలబాలికలకు వడ్డిస్తోన్న మధ్యాహ్న భోజన పథకం ఆహార పదార్థాల నాణ్యతను స్కూలు హెచ్‌ఎం రుచి చూసినతర్వాతే పిల్లలకు అందించాలని జేసీ ధాత్రిరెడ్డి ఆదేశించారు.

హెచ్‌ఎం రుచి చూశాకే పిల్లలకు పెట్టాలి
సుబ్బమ్మదేవి మునిసిపల్‌ స్కూలులో పిల్లలతో కలసి భోజనం చేస్తున్న జేసీ

జేసీ ధాత్రిరెడ్డి ఆదేశం

ఏలూరు అర్బన్‌, జూలై 30 : పాఠశాలల్లో బాలబాలికలకు వడ్డిస్తోన్న మధ్యాహ్న భోజన పథకం ఆహార పదార్థాల నాణ్యతను స్కూలు హెచ్‌ఎం రుచి చూసినతర్వాతే పిల్లలకు అందించాలని జేసీ ధాత్రిరెడ్డి ఆదేశించారు. మంగళవారం నగరంలోని సుబ్బమ్మదేవి మున్సిపల్‌ స్కూలులో భోజన పథకం అమలు తీరు, అమీనాపేట–1 సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల వసతిగృహం స్టాక్‌ పాయింట్‌, వంట గదిని, ద్వారకానగర్‌, తంగెళ్ళమూడి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్దేశిత ఆహారపట్టిక ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పెట్టాలని సూచించారు. కోడిగుడ్డు, ఫోర్టిఫైడ్‌ బియ్యం తదితర నిత్యావసర సరుకుల భద్రత విష యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యా ర్థుల హాజరు, స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలిం చారు. ఐసీడీఎస్‌ పీడీ పద్మావతి, బీసీ, సోషల్‌ వెల్ఫేర్‌ జేడీలు నాగమణి, జయప్రకాష్‌, పౌరసరఫరాల సంస్థ డీఎం మంజుభార్గవి, డీఎస్‌వో రాజు, డీవైఈవో రవిప్రకాష్‌, డీఈవో కార్యాలయ ఏడీ–2 షరీఫ్‌, ఎంఈవో రంగయ్య, ఫుడ్‌సేఫ్టీ ఽఅధికారి రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:11 AM