Share News

జనవరి నుంచి తల్లికి వందనం

ABN , Publish Date - Oct 19 , 2024 | 12:28 AM

ఎన్నికల ముందు తెలుగుదేశం కూటమి ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఒక్కొ క్కటిగా అమలుచేస్తోంది. వృద్ధులకు పెన్షన్‌ పెం చింది. తాజాగా అమ్మకి వందనం పథకం అమ లుకు చర్యలు తీసుకుంటోంది.

జనవరి నుంచి తల్లికి వందనం

జిల్లాలో 2.39 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

ఒక ఇంటిలో ఎందరు పిల్లలున్నా అమలు.. అమ్మ ఒడి కంటే మెరుగ్గా..

జిల్లాలో విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలు : 1,385

విద్యార్థులు 1.04 లక్షలు

ప్రైవేటు స్కూల్స్‌ : 495

విద్యార్థులు : 1.35 లక్షలు

మొత్తం 2.39 లక్షలు

భీమవరం ఎడ్యుకేషన్‌, అక్టోబరు 18(ఆంధ్ర జ్యోతి): ఎన్నికల ముందు తెలుగుదేశం కూటమి ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఒక్కొ క్కటిగా అమలుచేస్తోంది. వృద్ధులకు పెన్షన్‌ పెం చింది. తాజాగా అమ్మకి వందనం పథకం అమ లుకు చర్యలు తీసుకుంటోంది. ఇంటిలో ఎంత మంది పిల్లలున్నా ఈ పథకం కింద రూ.15 వేలు చొప్పున అందిస్తామంటూ ఎన్నికల ముం దు చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అజెం డాలో పెట్టారు. తాజాగా పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆధార్‌ కార్డులు తీసుకుంటున్నారు. ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థులందరికి ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి రాదు. ఈ పథకం ఎప్పటికి అమలు చేస్తారని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. అందరికి పథకం అమలు వల్ల ప్రభుత్వంపై భారీగా భారం పడుతుంది. అయినా సరే కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటిలో కేవలం ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకాన్ని అమలు చేశా రు. ఏటా రూ.15 వేలు ఇస్తామన్న హామీని అమలు చేయలేదు. పాఠశాల నిర్వ హణ కోసమని రూ.2 వేలు కోత విధించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు కోత పడింది. కేవలం రూ.13 వేలు మాత్రమే అందజేశారు. అప్పట్లో జిల్లావ్యాప్తంగా 1.45 లక్షల మంది విద్యార్థులకు పథకాన్ని అమలు చేశారు. ఏటా రూ.245 కోట్లు మంజూరుచేశారు. కూటమి ప్రభుత్వం ఇద్దరు పిల్లలు వుంటే రూ.30 వేలు మంజూరు చేయనుంది. అయితే బడికి వెళ్లే పిల్లలకు మాత్రమే పథకం వర్తిస్తుంది. హాజరు శాతం కచ్చితంగా ఉండాలి. అప్పుడే పథకా నికి అర్హులవుతారు. వైసీపీ హయాం లో ఏదో ఒక అవరోధంతో ఎంతోమం ది అమ్మ ఒడికి నోచుకోలేదు. ఆధార్‌ కార్డుల్లో తేడాలు, బ్యాంకు అకౌంట్‌ల లో తప్పులు, వెబ్‌సైట్‌లో లోపాల కారణంగా పొందలేకపోయారు. దీనిపై అప్పటి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు.

కూటమి ప్రభుత్వంలో అలాంటి సమస్యలు లేకుండా ముందస్తుగానే అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అప్పుడే పథకం సక్రమంగా అమలు జరుగుతుంది.

Updated Date - Oct 19 , 2024 | 12:30 AM