జనవరి నుంచి కొత్త పింఛన్లు
ABN , Publish Date - Oct 18 , 2024 | 12:24 AM
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు శ్రీకారం చుట్టనుంది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు భరోసాగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం అవ్వా తాతలకు పింఛన్‌ను పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చింది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు శ్రీకారం చుట్టనుంది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు భరోసాగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం అవ్వా తాతలకు పింఛన్‌ను పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చింది. ప్రతీ నెల ఒకటి, రెండు తేదీల్లో ఇంటింటికి ఈ మొత్తాలను అందించింది. ఇప్పుడు నవంబర్ నుంచి అర్హులైన కొత్త
పింఛనుదారులను ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీరికి జనవరి నుంచి అందించనుంది. ఏడాదిగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి భరోసా లభిస్తుంది.
వైసీపీ నిర్వాకంతో 16 నెలలుగా కొత్త అర్హులకు అందని పింఛన్లు
నవంబరు నుంచి ఎంపిక చేసి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
భీమవరం ఎడ్యుకేషన్, అక్టోబరు 17(ఆంధ్ర జ్యోతి): కొత్త పింఛన్ల మంజూరులో గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన మెలికతో 16 నెలలుగా అర్హు లైన వృద్ధులు, వితంతువులకు పింఛన్‌లు అం దుకోలేకపోయారు. ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు ఇస్తామన్నారు. గత ఏడాది జూన్‌లో ఇచ్చారు. మళ్లీ ఈ ఏడాది జనవరిలో ఇవ్వాలి. అలా ఇవ్వకుండా దరఖాస్తు యాప్‌ను క్లోజ్ చేశా రు. అప్పటి వరకు జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న 4,200 మందికి పింఛన్‌లు అందలేదు. తర్వాత సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల కోడ్ వచ్చింది. వైసీపీ ఓటమి పాలైంది. తెలుగు దేశం, జనసేన, బీజేపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణ యించింది. అప్పటిలో దరఖాస్తు చేసుకునే యాప్ క్లోజ్ చేయడం వల్ల ఏడాదిగా అర్హులైన పింఛన్‌దారులు దరఖాస్తు చేసుకునే వీలు లేకపోయింది. దరఖాస్తు చేసుకునే అవకాశం వస్తే జిల్లాలో ఇప్పుడు మరో ఐదు వేల మందికి పైగా అర్హులు పెరుగుతారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి మొత్తం తొమ్మిది వేల మందికిపైగా పింఛన్లు పొందే అవకాశం వుంది.
రూ.38 కోట్లు అదనం..
పింఛన్ల పెంపుదల ప్రభుత్వానికి భారమైనప్ప టికీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే మాట నిలబెట్టుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో జిల్లాలో లక్షా 32 వేల మంది పింఛనుదారులకు రూ.59 కోట్లు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు లక్షా 31 వేల పింఛనుదారులకు రూ.97 కోట్లు ఇచ్చారు. పింఛన్ పెంపుతో నెలకు జిల్లాలో ప్రభుత్వంపై రూ.38 కోట్ల భారం పడింది. వచ్చే జనవరి నుంచి కొత్త పింఛన్లు వస్తే ఈ సొమ్ము మరింత పెరుగుతుంది.
అప్పుడు అనర్హులకు పింఛన్లు
తాము నడవలేని స్థితిలో వున్నామని చెప్పి కొందరు వికలాంగ పింఛన్లు పొందుతున్నారని ఇప్పటికే టీడీపీ నేతలు అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై విచారణ జరిపించేందుకు ఉన్న తాధికారులు నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలా ఎంత మంది అనర్హులు పింఛ న్లు పొందారు ? మంచం పట్టిన వికలాంగులు ఎందరు ? అనే అంశంపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది.