Share News

రాక్షస పాలన అంతమొందించాలి

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:14 AM

రాష్ట్రంలో రాక్షసపాలన అంతమొందించడ మే లక్ష్యంగా పనిచేయాలని జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమ న్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి పిలుపునిచ్చారు.

రాక్షస పాలన అంతమొందించాలి
ఏలూరులో మాట్లాడుతున్న ఘంటసాల వెంకటలక్ష్మి

జనసేన పార్టీ సమావేశాల్లో నాయకుల పిలుపు

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో రాక్షసపాలన అంతమొందించడ మే లక్ష్యంగా పనిచేయాలని జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమ న్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి పిలుపునిచ్చారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం వెంకటలక్ష్మి అధ్యక్షతన ఆదివారం నిర్వ హించారు. ప్రతి జనసేన నాయకులు, కార్యకర్తలు వైసీపీ పాలనను అంత మొందించి రాష్ట్రప్రజలను కాపాడేందుకు కంకణబద్దులు అవ్వాలని జనసేన, టీడీపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ అభ్యర్థికి సీటు ప్రకటించినా కూడా గెలుపే లక్ష్యం గా పనిచేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. నారా శేషు, రాఘవయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం: ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ చిర్రి బాలరాజు, కరా టం సాయిబాబు అన్నారు. బయ్యన్నగూడెంలో ఆదివారం జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలకు వెళ్లడానికి రహదారులు కూడా వెయ్యలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. రోడ్లు కనీస మరమ్మతులు కూడా చేపట్టకుండా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు గడిపేసిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలని జనసేన, టీడీపీ విజయానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బయ్యన్నగూడెంలో ఇం టింటికి వెళ్లి పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు వివరించారు. కార్యక్రమంలో తోట రవి, మద్దు తేజ, దుగ్గిన శ్రీను, చోడి పిండి సుబ్రహ్మణ్యం, మాదేపల్లి శ్రీను, ఏపూరి సతీష్‌, సుంకర రాజేష్‌, భువనేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన వంద మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్‌చార్జి చిర్రి బాలరాజు, కరాటం సాయిబాబు వారికి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. కార్యక్రమంలో వెంకట్‌, పారేపల్లి పండు, చిన్నం మహేష్‌, గోపి, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు: వైసీపీ పాలనలో గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉ న్నాయని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఉప్పాకపాడులో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరి గి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీటీసీ ఇంటి మంగరాజు, పంది రాంబాబు, నిమ్మల దొరబాబు, అంబటి మాధవి, ముత్యాల సునీత, పెద్దిశెట్టి తులసి, మంచాల వెంకటలక్ష్మి, రాగాల రవి, దాసరి నాగరాజు, కుం పట్ల భరత్‌ కుమార్‌, ముత్యాల రూప మణికంఠ, తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. కంభంపాటి రమేష్‌, గరగ వెంకటేశ్వర్లు ఆఽధ్వర్యంలో పార్టీలో చేరిన వారిని ఇన్‌చార్జి ధర్మ రాజు ఆహ్వానించారు. సురత్తుల అయ్యప్ప, తాడిశెట్టి శివ ప్రసాద్‌, ఇల్లిందల సురేష్‌, వెజ్జు బాబు నాయుడు, మీసాల హరిబాబు పాల్గొన్నారు.

ఏలూరు కార్పొరేషన్‌: జగన్‌ రెడ్డి సీఎం పదవికి అనర్హుడని జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. నగిరెడ్డి కాశీ నరేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కులాలను విడదీస్తూ బ్రిటీష్‌ తరహాలో పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఘంటశాల వెంకటలక్ష్మి, సరిది రాజేష్‌, ఒబిలిశెట్టి శ్రావణకుమార్‌గుప్త, పులి శ్రీరాములు, రామ్మోహన్‌రావు, చంద్రశేఖర్‌, డి.రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:14 AM