Share News

ఘనంగా జగ్జీవన్‌రామ్‌ జయంతి

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:35 AM

స్వాతంత్య్ర సమరయోథుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సేవలను కొనియాడారు.

ఘనంగా జగ్జీవన్‌రామ్‌ జయంతి
ఏలూరులో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి నివాళి

వాడవాడలా విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులు

స్వాతంత్య్ర సమరయోథుడు బాబూ జగ్జీవన్‌రామ్‌

జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సేవలను కొనియాడారు.

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 5: టీడీపీ ఏలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి బుజ్జి క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ జగ్జీవన్‌రామ్‌ చిత్రపటం వద్ద బడేటి బుజ్జి తదితరులు నివాళుల ర్పించారు. టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలాజి, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, కొత్తాడ రమణ, బి.కుటుంబరావు, దళిత నాయకు లు పాల్గొన్నారు. ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ళ నాని, ఓవర్‌బ్రిడ్జి సమీపంలో వున్న విగ్రహానికి నగరపాలక సంస్థ కమిషనర్‌ నివాళులర్పించారు. స్థానిక జడ్పీ కార్యాలయంలోని విగ్రహానికి బీటీఏ ఆధ్వర్యంలో, ఓవర్‌బ్రిడ్జి వద్ద వున్న విగ్రహానికి బహుజన్‌ సమాజ్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేతల రమేష్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఏలూరు జిల్లా క్రిష్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు జెంజు మోజేష్‌, ఎన్‌డీఏ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి తదితరులు నివాళులర్పించారు. దళితసేన ఆధ్వర్యంలో రెండో డివిజన్‌ లో వున్న విగ్రహానికి దళితసేన వ్యవస్థాపక అధ్యక్షుడు జుజ్జువరపు రవిప్రకా ష్‌, యూత్‌ కమిటీ కన్వీనర్‌ విజయ్‌ప్రకాష్‌ తదితరులు నివాళులర్పించారు.

ఏలూరు క్రైం : భారతీయ వ్యవసాయాన్ని ఆధునికీకరించడంలో బాబూజగ్జీవన్‌రామ్‌ కృషి ఎనలేనిదని జిల్లా అదనపు ఎస్పీ జి.స్వరూపరాణి కొనియాడారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జగజ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు, ఏఆర్‌ డీఎస్పీ విజి శ్రీహరిరావు, ఎస్సీఎస్టీ సెల్‌ డీఎస్పీ ఆర్‌జే రామాంజినాయక్‌, ఆర్‌ఐ పవన్‌కుమార్‌, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఏలూరు ఎడ్యుకేషన్‌ : సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించడానికి జగ్జీవన్‌రామ్‌ చేసినకృషి అందరికీ స్ఫూర్తిదాయకమని డీఈవో అబ్రహం అన్నారు. ఏలూరు సెయింట్‌ గ్జేవియర్‌ హైస్కూలు క్యాంపులో జరుగుతున్న పదోతరగతి మూల్యాంకన శిబిరంలో డెమొక్రటిక్‌ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. స్పాట్‌ విదుల్లోవున్న సుమారు 12వందల మంది టీచర్లకు డీపీఆర్టీయూ నాయకులు మజ్జిగను పంపిణీ చేశారు. సంఘ నాయకులు అచ్యుతరావు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిష నర్‌ శ్రీకాంత్‌, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్‌ బుధవ్యాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు : ఉంగుటూరు మండలం ఉంగుటూరు, నారాయణపురం, గోపీనాఽథపట్నం తదితర గ్రామాల్లో ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో, నారాయణపురంలో సర్పంచి దిడ్ల అలకనంద ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు.

జంగారెడ్డిగూడెం/కామవరపుకోట/లింగపాలెం/చింతలపూడి : జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ కార్యాలయం, ఏలూరు రోడ్డులో వున్న జగ్జీవన్‌రామ్‌ విగ్రహా నికి పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, పగడం సౌభాగ్యవతి, పాతూరి అంబేడ్కర్‌, మండవ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసపురంలో జగ్జీవన్‌రామ్‌ యువజన సంఘం అధ్యక్షుడు జొన్నకూటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో, జంగారెడ్డిగూడెం దళిత వాడ, నవచైతన్య అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కామవరపు కోట మండలం వీరిశెట్టి వారిగూడెంలో ఎమ్మార్పీఎస్‌ మండల కార్యదర్శి భారతాల రమేష్‌ మాదిగ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రజలకు మహాఅన్నదానం నిర్వహించారు. లింగపాలెం మండలంలో టీడీపీ చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్‌, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌కుమార్‌యాదవ్‌ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతిరావు, మోరంపూడి మల్లికార్జునరావు, ముసునూరి రాము, తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి మారుతీనగర్‌లో ఎన్‌డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోడా నాగభూషణం, మారుమూడి థామస్‌, పి.నాగవిజయ్‌కుమార్‌, ఆనంద్‌, భారతి, అనిష్‌కుమార్‌ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో విజయ, ఎన్‌.ఎస్‌ రాజేంద్ర తదితరుల ఆధ్వర్యంలో ర్యాలీగా పాత బస్టాండు వరకు నినాదాలతో పాల్గొన్నారు.

బుట్టాయగూడెం/టి.నరసాపురం/పోలవరం : బుట్టాయగూడెం మండలం బుట్టాయగూడెంలో జగజ్జీవన్‌రాయ్‌ జయంతి వేడుకలను కేవీపీఎస్‌ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నాయకుడు అందుగుల ప్రాన్సిస్‌ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. టి.నరసాపురం మండలం కె.జగ్గవరంలో జగ్జీవన్‌రామ్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జగ్జీవన్‌రామ్‌ నివాళులు అర్పించారు. పోలవరం మండలంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు, పంచాయతీ కార్యాలయ ఆవరణ బయట వున్న జగజ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి అభ్యుదయ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎల్లండీపేటలో ఎమ్మార్పీఎస్‌ నేత కూనపాము వెంకటేష్‌ తదితరులు కేక్‌ కట్‌ చేసి పులిహోర పంపిణీ చేశారు.

కుక్కునూరు: కుక్కునూరు మండలం సీతారామనగరంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. దళిత సంఘాల నాయకులు మడిపల్లి రమణయ్య, కొమ్ము వీరబాబు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాజులు, వడ్డే రఘు, మడకం వీరయ్య, బాణాల వీరాచారి పాల్గొన్నారు.

పెదపాడు : పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో మాజీ ఎంపీపీ నిమ్మకూరి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Apr 06 , 2024 | 12:35 AM