Share News

మరమ్మతుల ఊసే లేదు..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:13 AM

వర్షాకాలం ప్రారం భం కావడంతో చెరు వుల కింద సేద్యం చేసే రైతులకు సాగు నీటి సమస్యల్లో భాగం గా పంట కాల్వలకు నీరువచ్చే తూములకు షట్టర్లను బాగు చేయక పోవడం వల్ల చెరువు లకు గడ్డు పరిస్థితి ఏర్పడింది.

మరమ్మతుల ఊసే లేదు..!
పాడైన పెద్దచెరువు తూము షట్టర్‌

వర్షాధార చెరువులకు గడ్డు పరిస్థితి

చింతలపూడి పెద్దచెరువుదీ అదే దుస్థితి

ఆక్రమణల జోరు.. కుంచించుకుపోతున్న వైనం

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కాలుష్య కాసారం

చింతల పూడి, జూన్‌ 7: వర్షాకాలం ప్రారం భం కావడంతో చెరు వుల కింద సేద్యం చేసే రైతులకు సాగు నీటి సమస్యల్లో భాగం గా పంట కాల్వలకు నీరువచ్చే తూములకు షట్టర్లను బాగు చేయక పోవడం వల్ల చెరువు లకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. చింతలపూడి మండలంలో వరి సాగు అధికభాగం వర్షాధారమైన చెరువుల కింద సేద్యం సాగుతోంది. మండలంలో నీటిపారుదల శాఖకు చెందిన సాగునీటి చెరువులు 12 వరకు ఉన్నాయి. ఇవి చాలాభాగం అనుసంధా నంలా ఒక చెరువు నిండితే, అదనపు నీరు దిగువ చెరువుకు చేరుతుంది. చెరువులు మరమ్మతులకు నోచుకోలేక ఒకపక్క ఉంటే, మరోపక్క పూడికలు పెరిగి, ఆక్రమణలకు గురై విస్తీర్ణం కుంచించుకుపోతున్నాయి. చింతలపూడి పెద్దచెరువులో బైపాస్‌ రోడ్డు వేసినా బ్యాక్‌వాటర్‌ రావడానికి వంతెనలు నిర్మించారు. అవి చెత్తతో పూడిక పోయాయి. దీంతో పక్కన ఉన్న కాలనీవాసులు కొందరు ఆక్రమణలు చేస్తున్నారు. మరోపక్క రియల్‌ ఎస్టేట్‌ దారి కోసం చెరువులోనే రోడ్డు వేశారు. దీనివల్ల వర్షం పడినప్పు డు బ్యాక్‌ వాటర్‌ చెరువులోకి రావడం లేదు. ఉన్నతాధి కారులు పరిశీలించినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే చెరువు తూములు, షట్టర్లు పాడైపోయాయని, వాటికి తక్షణ మరమ్మతులు చేయకపోతే ఈ ఏడాది సాగునీరు నిల్వ ఉండే సామర్థ్యం తగ్గిపోయి సాగునీటి సమస్య ఏర్పడుతుందని చెరువు ఆయకట్టు సంఘం పెద్దలు చెబుతున్నారు. దీనిపై నీటి పారుదలశాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎటువంటి చర్యలు లేవన్నారు. చెరువు అదనపు నీరు వెళ్ళే స్లూయిస్‌ కూడా చెత్త, ప్లాస్టిక్‌తో నిండిపోయింది. ఈ చెరువు కింద అధికారికంగా 760 ఎకరాలు సాగవుతోంది. ఇదికాకుండా అనధికారికంగా కూడా సాగులో ఉంది. మరోవైపు ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీసుకొచ్చి చెరువులో పోసేస్తున్నారని చెరువు కాలుష్యంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శెట్టివారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాల్వ పుట్టుక అయిన మేడవైపు చెరువు తూములు బాగు చేయాలంటూ ఆయ కట్టు రైతులు ఇటీవల అధికారులకు మొరపెట్టుకున్నా కనీసం కన్నెత్తి చూడలేదని ఆ చెరువు ఆయకట్టుదారుడు ఆది సత్యనారాయణ తెలిపారు.

కాలుష్యం బారిన చెరువు ..

చింతలపూడి పెద్దచెరువు కింద సేద్యం ఎక్కువ. ఇప్పుడు ఈ చెరువు ఆక్రమణల పర్వంతో పాటు చెత్తా చెదారం వేసి కాలుష్యం పెంచారు. ఒకప్పుడు మేమంతా ఈ చెరువులో నీరుతెచ్చి మంచినీరుగా వాడు కునే వాళ్ళం. ఇప్పుడు ఈ చెరువు వ్యర్థాలతో నిండి కాలుష్య కాసారంగా మారుతోంది. చెరువు తూములు మరమ్మతుల బారిన పడినా అధికారులు పట్టించుకోవడం లేదు.

– చిట్లూరి అంజిబాబు, ఆయకట్టు సంఘం, మాజీ అధ్యక్షుడు, చింతలపూడి

Updated Date - Jun 08 , 2024 | 12:13 AM