మధ్యంతర భృతి ప్రకటించాలి
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:02 AM
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటవుతున్న ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, 12వ పీఆర్సీని నియమిం చడంతో పాటు, మధ్యంతరభృతి (ఐఆర్)ను ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్
ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 11:రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటవుతున్న ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, 12వ పీఆర్సీని నియమిం చడంతో పాటు, మధ్యంతరభృతి (ఐఆర్)ను ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరులోని సంఘ జిల్లా కార్యాలయంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా కార్య వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ–2008, 1998 ఎస్జీటీలను కనీస వేతనస్కేలు(ఎంటీఎస్)పై కాకుండా రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలన్నారు. ఉద్యోగ, ఉపాద్యాయులకు 11వ పీఆర్సీలో జరిగిన నష్టాన్ని భర్తీచేసి, ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాల న్నారు. మున్సిపల్ టీచర్ల బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని డిమాండ్ చేశా రు. పాఠశాలల్లో యాప్‌ల నిర్వహణకు బోధనేతర సిబ్బందిని నియమిం చాలని, సీపీఎస్‌ను రద్దుచేయాలని కోరారు. సంఘ సీనియర్ నాయకులు డీ.వీ.ఏ.వీ. ప్రసాదరాజు, నారాయణ, ప్రకాశరావు, జిల్లా నాయకులు పవన్, రాము, వెంకటే శ్వరరావు, పలు మండలాల ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు