Share News

మహిళకు వందనం

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:16 AM

కుటుంబ సంరక్షణ, నిర్వహణతో పాటు ఉద్యో గం, ఆలోచన విధానంలో పురుషులతో పోలిస్తే మహిళలు ముందుంటారని శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్‌పర్సన్‌ మేరీ గ్రేస్‌ కుమారి అన్నారు.

మహిళకు వందనం
సీఆర్‌ఆర్‌ కళాశాలలో జేసీ లావణ్యవేణికి సత్కారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు

ఏలూరు క్రైం, మార్చి 7: కుటుంబ సంరక్షణ, నిర్వహణతో పాటు ఉద్యో గం, ఆలోచన విధానంలో పురుషులతో పోలిస్తే మహిళలు ముందుంటారని శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్‌పర్సన్‌ మేరీ గ్రేస్‌ కుమారి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తమకుమార్‌ ఆధ్వర్యంలో న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె రత్న ప్రసాద్‌ అధ్యక్షతన గురువారం మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. మేరీ గ్రేస్‌కుమారి మాట్లా డుతూ సామాజిక, ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. మహిళలు వారి ఆరోగ్యం కూడా సంరక్షించుకోవాలని తెలిపారు. మహిళలకు సంబంధించి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సదస్సులో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కెకె బుల్లికృష్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె రత్న ప్రసాద్‌, జిల్లా వినియోగదారుల సభ్యురాలు నాగలక్ష్మి సమాజంలో మహిళల పాత్ర, ఆర్థిక స్థితిగతులు, మహి ళా సాధికారత, మహిళా విద్య, తదితర అంశాలపై సదస్సులో వివరించడం జరిగింది. అనంతరం మేరీ గ్రేస్‌కుమారి, జిల్లా వినియోగదారుల సభ్యురాలు నాగలక్ష్మి, ఛానల్‌ అడ్వకేట్‌ ఆకుల గంగాభావానిని సన్మానించారు. కెకె.బుల్లి కృష్ణ, జి.దుర్గా ప్రసాద్‌, ప్యానల్‌ న్యాయవాదులు సీవీఎల్‌ఎస్‌, సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు కలెక్టరేట్‌: మహిళలు మహారాణులని సమాజాభి వృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని డీపీవో తూతిక శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ అన్నారు. డీపీవో కార్యాలయంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. డీపీవో దంపతులు ఉద్యోగులను శాలువా కప్పి సత్కరించారు. సీడీపీవో రాజశేఖర్‌, కె.సునీత, మల్లిక, జి.విజయ, పాతిమ, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, తహేర, సోములు, పి.సత్యనారాయణ, భాస్కర్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు ఎడ్యుకేషన్‌: మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సీ ఆర్‌ఆర్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జేసీ బి.లావణ్యవేణిని సత్క రించారు. ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతకు విద్యే ప్రధానాస్త్రమ న్నారు. సీఆర్‌ఆర్‌ విద్యా సంస్థల కార్యదర్శి మాగంటి ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థినులు ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలంటే గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీపడాలని, తల్లితండ్రుల గౌరవాన్ని పెంచాలని సూచించారు. కరస్పాండెంట్‌లు విష్ణు మోహన్‌, కె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ రామరాజు, మహిళా సాధికారత సెల్‌ కోఆర్డినేటర్‌ లావణ్య, లక్ష్మీసరస్వతి పాల్గొన్నారు.

కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు పద్మావతి, కావ్యశ్రీ, సుశ్యలత, మహిళా సాధికారత కోఆర్డినేటర్‌ ఉదయలక్ష్మిని సత్కరించారు. ప్రిన్సిపాల్‌ గిరిబాబు, కె.బి.రావు, సత్యనారాయణ, ఎల్‌.వెంకటేశ్వరరావు, అధ్యా పకులు పాల్గొన్నారు. శ్రీ శర్వాణీ హైస్కూల విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. సామంతుల ఝాన్సీలక్ష్మి, టీచర్లను సత్కరించారు. బి.హేమ సుందరి, హెచ్‌ఎం సత్యశారద, మదనమోహనరాజు పాల్గొన్నారు.

టి.నరసాపురం: ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందని పీహెచ్‌ సీ వైద్యాధికారి జె.కల్పనారాణి అన్నారు. పురం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మహి ళా దినోత్సవం, అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించారు. కల్పనారాణి మాట్లాడుతూ ఆడ పిల్లలకు అవకాశాలు కల్పిస్తే పురుషులతో సమానంగా రాణిస్తారన్నారు. మదర్‌ థెరిసా, మేడం క్యూరీ, సావిత్రి బాయి పూలే, ఝా న్సీలక్ష్మీబాయి వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం కల్పనా రాణిని ఘనంగా సన్మానించారు. విజయలక్ష్మి, వరలక్ష్మి, అరుణ, మహాలక్ష్మి, పుష్పవతి, ఎస్తేరు రాణి, మధులత, రమ్యశ్రీ, మౌనిక, రాజేశ్వరి పాల్గొన్నారు.

చింతలపూడి: మహిళలు అన్ని రంగాల్లో ముందుండి ప్రత్యేక చట్టాలు తెలుసుకోవాలని న్యాయాధికారి సి.మధుబాబు సూచించారు. సీడీపీవో కార్యాలయంలో మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ధైర్యంగా సమస్యలపై న్యాయ పోరాటం చేయాలని, చట్టాలపై అవగాహన ఉండాలని పలు చట్టాలపై వివరించారు. సీడీపీవో మాధవి, న్యాయవాదులు ఫరూఖ్‌, డేవిడ్‌రాజు, ఎం.డి.అక్బర్‌ ఆలీ పాల్గొన్నారు.

భీమడోలు: వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో సామాజిక వైద్య కేంద్రంలో ని మహిళా వైద్యులు, అధ్యాపకులను సత్కరించారు. ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ సునీత మాట్లాడుతూ విద్యార్థినులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థితిని పొంది సమాజాన్ని, కుటుంబాన్ని చక్కదిద్దాలని సూచించారు. వైద్యులతో పాటు జూనియర్‌ లెక్చరర్‌ లీలాకుమారిని సత్కరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ సేవా విభాగం అధికారి శశికాంత్‌, ఎన్‌సీసీ లెఫ్ట్‌నెంట్‌ ఆఫీసర్‌ కె.శివశంకర్‌, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:16 AM