Share News

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:14 AM

మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని కైకలూరు సీనియర్‌ న్యాయసేవాధికారిణి వీవీఎన్‌వీ లక్ష్మి అన్నారు.

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
కైకలూరులో మాట్లాడుతున్న వీవీఎన్‌వీ లక్ష్మి

కైకలూరు సీనియర్‌ న్యాయసేవాధికారిణి లక్ష్మి

ఘనంగా మహిళా దినోత్సవం.. పలువురికి సన్మానం

కైకలూరు, మార్చి 7:మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని కైకలూరు సీనియర్‌ న్యాయసేవాధికారిణి వీవీఎన్‌వీ లక్ష్మి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు ఐకేబీ భవనంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో స్త్రీ, పురుషులు ఒకటేనని వారి మధ్య వ్యత్యాసాలు చూపడం చట్టరీత్యా నేరమన్నారు. శివరాత్రి పండుగ పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే మహిళా దినోత్సవం జరుపుతున్నట్టు అంగన్‌వాడీ టీచర్లకు, డ్వాక్రా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాడెం వీరవెంకట సత్యనారాయణ, సెక్రటరీ బి.లక్ష్మణరావు, జాయింట్‌ సెక్రటరీ, చావలి శంకరశాస్త్రి, ఏపీఎం బి.సత్యనారాయణ, ఇన్‌చార్జి సీడీపీవో లావణ్య, తదితరులు పాల్గొన్నారు. కైకలూరు టౌన్‌ పోలీసుస్టేషన్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా పోలీసుసిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను సీఐ ఆకుల రఘు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులును ఘనంగా సత్కరించారు. ఏఎస్‌ఐ మల్లికార్జునరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ముసునూరు : మహిళలు అన్ని రంగాల్లో నైపుణ్యత సాధించి, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఐసీడీయస్‌ ఆసిస్టెంట్‌ సీడీపీవో నాగేశ్వరి అన్నారు. గురువారం వెలుగు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకులు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్‌ కొండేటి విజయలక్ష్మి మాట్లాడుతూ దేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర ఫైనాన్స్‌ మినిస్టర్‌ నిర్మలా సీతారామన్‌, వంటి మహిళాలు ఉన్నతస్థానాలను సాధించారని, వీరి ఆదర్శంగా తీసుకుని మందుకు సాగాలన్నారు. అనంతరం ఎంపీపీ కొండా దుర్గాభవాని మాట్లాడారు. పలు పోటీల్లో విజేలుగా నిలిచిన మహిళలకు ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు రాజ్యలక్ష్మి, కె.ధనలక్ష్మి, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

ముదినేపల్లి, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముదినేపల్లి తహసీల్దార్‌ ఎస్‌.లక్ష్మీ నరస కుమారిని యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ మండల శాఖ ఘనంగా సత్కరించింది. గురువారం యూటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షురాలు శాయి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఐ.దుర్గా ప్రసాద్‌ తదితరులు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆమెను సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పలు అవార్డులు సాధించిన ఆమెను యూటీఎఫ్‌ నాయకులు అభినందించారు.

ఆగిరిపల్లి, మార్చి 7: వట్టిగుడిపాడు మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గ్రామసర్పంచ్‌ శ్రీమతి కిరణ్మయ్‌ప్రకాష్‌ మాట్లాడుతూ స్ర్తీలు అభివృద్ధి పథంలో పయనించాలని, ప్రతిరంగంలో ముందంజ వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యాశాఖ అధికారులు కె.సర్వేశ్వరరావు, కె.ఆనంద్‌కుమార్‌ మాట్లాడు తూ స్ర్తీగొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకులు చౌటపల్లి సురేష్‌ మాట్లాడుతూ మహిళలు రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుని విద్యారంగంలో ఎదగాలని సూచించారు. అనంతరం గ్రామసర్పంచ్‌ పాఠశాలలో పనిచేసే మహిళా ఉద్యోగినిలను వంట ఏజెన్సీ వారిని పారిశుధ్య కార్మికురాలిని సత్కరించారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎ ఇందిర, అంకం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ముదినేపల్లి రూరల్‌, మార్చి 7: శ్రీహరిపురం గ్రామంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు విభిన్నరంగాల్లో సాధించిన ప్రగతిని సమావేశంలో వక్తలు ప్రశంసించారు. సమాజంలో మహిళపాత్ర ఎంతో ప్రాముఖ్యత ఉందని మహిళ లేనిదే సమాజం లేదని వక్తలు అభివర్ణించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పరసా విశ్వేశ్వరరావు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

మండవల్లి, మార్చి 7: మండవల్లిలోని కృష్ణాజిల్లా సహకార కేంద్రబ్యాంకు ఆధ్వర్యంలో గురువారం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పలు సొసైటీల మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. మండవల్లి బ్రాంచి మేనేజర్‌ రాజులపాటి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో మండవల్లి బ్రాంచి సూపర్‌వైజర్‌ ఉండవల్లి సాయికృష్ణ, సిబ్బంది, వినియోగదారులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:14 AM