Share News

సహనానికి ప్రతిరూపం మహిళ

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:25 AM

సహనానికి ప్రతిరూపం మహిళ అని, మహిళా దినోత్సవం స్ఫూర్తిని ప్రతీరోజు కొనసాగించాలని మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీదేవి అన్నారు.

సహనానికి ప్రతిరూపం మహిళ
భీమవరం మునిసిపాల్టీలో గాంధీ విగ్రహం వద్ద ర్యాలీ

మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీదేవి

భీమవరంటౌన్‌,మార్చి 5 : సహనానికి ప్రతిరూపం మహిళ అని, మహిళా దినోత్సవం స్ఫూర్తిని ప్రతీరోజు కొనసాగించాలని మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీదేవి అన్నారు. శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మున్సిపల్‌ కార్యాలయం నుంచి మెప్మా మహిళలు, సూపర్‌ వైజర్లతో ప్రకాశం చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించగా ఆమె ప్రారంభించి మాట్లాడారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ వారం రోజులుగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని, బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, విశిష్ట మహిళా సేవాతత్పరులను సత్కరిస్తామన్నారు. సీవో జయకృష్ణ, పీవో నానిబాబు, పెద్దింట్లమ్మ, సంతోషమ్మ, పీఎస్‌ఎం, డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, సర్‌ సీవీ రామన్‌ స్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

భీమవరంటౌన్‌ :డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ర శీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో రంగవల్లుల పోటీలను నిర్వహించారు. పోటీలను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అంజన్‌కుమార్‌ ప్రారంభించారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వర్మ లైబ్రేరియన్‌ కె.శిరీష మాట్లాడుతూ 125 మంది విద్యార్థినులు పోటీలను నిర్వహించామని, విజేతలకు ముగింపు రోజున బహుమతులను అందజేస్తామన్నారు.

కాళ్ళ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కె.సూర్యకుమారి అన్నారు. కోపల్లెలో మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ స్కూల్‌ హెచ్‌ఎం జోజికుమారి, ఏఎన్‌ఎం ధనలక్ష్మి, అరుణ, మహిళలు పాల్గొన్నారు.

వీరవాసరం : మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని ఐసీడీ ఎస్‌ భీమవరం ప్రాజెక్టు సీడీపీవో టీకే లక్ష్మీకాంతం అన్నారు. మంగళవారం వీరవాసరం పల్లపువీధి అంగన్వాడీ కేంద్రాలలో బేటి బచావో బేటి పడావో, మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈనెల ఎనిమిదో తేదీ వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో మహిళాదినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. శిశుగృహ మేనేజర్‌ జయలక్ష్మి, సూపర్‌వైజర్‌ వి.కనకమహాలక్ష్మి, కె.నాగేశ్వరరావు, ఎన్‌.నిర్మల, బి.సత్యవతి, జి. నాగమణి, పి.నాగరత్నం పాల్గొన్నారు.

ఆకివీడు, : బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రత్నకుమారి అన్నారు .అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక వారపు సంత అంగన్వాడీ కేంద్రంలో తల్లుల తో సమావేశం అనంతరం ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. లింగనిర్థారణ, 1994 చట్టం అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీలు ఉన్నారు.

ఉండి : మహిళలంతా తమహక్కుల సాధన కోసం కృషి చేయాలని అంగన్‌వాడీ సూపర్‌వైజరు వి.నిర్మల పిలుపునిచ్చారు. మంగళవారం మహదేవపట్నం అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్యవివాహాలు వల్ల కలిగే నష్టాలు, అనర్థాలను వివరించారు. ఎంఎల్‌హెచ్‌పీ సుబ్బలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:25 AM