Share News

బాలికలదే పైచేయి

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:33 AM

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇంటర్‌ సిలబస్‌ను వేగంగా ముగించి, పరీక్షలను కొన్ని వారాల ముందుగానే నిర్వహిం చినప్పటికీ గతేడాదికంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది.

	బాలికలదే పైచేయి

ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రంలోనే తొమ్మిదో స్థానంలో పశ్చిమ గోదావరి

గత ఏడాదికంటే పెరిగిన ఉత్తీర్ణత

సెకండియర్‌ 80 శాతం, ఫస్టియర్‌ 69 శాతంతో పాస్‌

భీమవరం ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 12 : ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇంటర్‌ సిలబస్‌ను వేగంగా ముగించి, పరీక్షలను కొన్ని వారాల ముందుగానే నిర్వహిం చినప్పటికీ గతేడాదికంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలురకంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు. గత ఏడాది 13 ఉమ్మడి జిల్లాలకు గాను తొమ్మిదో స్థానంలో నిలవగా, ఈ ఏడాది 26 కొత్త జిల్లా లకు గాను తొమ్మిదో స్థానం సాధించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా జనరల్‌ ఫస్టియర్‌ విద్యార్థులు 15,645 మంది పరీక్షలకు రాయగా 10,843 మంది (69 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 13,161 మందికి గాను 10,470 మంది (80 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జనరల్‌ కేటగిరిలో ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు ఫస్టియర్‌ 13,729 మందికి గాను 9,930 మంది, ద్వితీయ సంవత్సరం 11,672కి 9,479 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జనరల్‌ కేటగిరిలో ఫస్టియర్‌ 7,194 మంది బాలురకు గాను 4,598 మంది, 8,451 మంది బాలికలకు గాను 6,245 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 5,830 మంది బాలురకు గాను 4,366 మంది, 7,331 మంది బాలికలకు గాను 6,104 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ కేటగిరిలో మొదటి సంవత్సరం 570 మంది బాలురకు గాను 284 మంది, 994 మంది బాలికలకు గాను 692 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం 410 మంది బాలురకు గాను 246 మంది, 813 మంది బాలికలకు గాను 628 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫస్టియర్‌ విద్యార్థులు 866 మంది గాను 351 మంది, ద్వితీయ సంవత్సరంలో 694కి 460 మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారు. ఆదర్శ విద్యార్థులు ప్రథమ సంవత్సరం 1070 మందికి గాను 562 మంది, ద్వితీయ సంవత్సరం 839 మందికి గాను 531 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 1,575 మందికి గాను 981 మంది (62 శాతం) ఉత్తీర్ణతగా నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో 1,229 విద్యార్థులకు 877 (71 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రథమ సంవత్సరం 929 మందికి 522 మంది, ద్వితీయ సంవత్సరంలో 771 మందికి గాను 559 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలలో ప్రథమ సంవత్సరం 301 మందికి గాను 157 మంది ద్వితీయ సంవత్సరంలో 231 మందికి 146 మంది ఉత్తీర్ణత సాధించారు.

మే 25న సప్లిమెంటరీ ఫలితాలు

ఇంటర్మీడియట్‌లో ఫెయిల్‌ అయిన వారితోపాటు ఫలితాలను మెరుగుపరుచుకునే వారి కోసం మే 25వ తేదీ నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్‌లో ఫెయిల్‌ అయిన వారికి జిల్లా కేంద్రంలోని ఒక పరీక్ష కేంద్రంలో మే 1 నుంచి నాలుగో తేదీ వరకు నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాల రీ వెరిఫికేషన్‌ ఒక్కో పేపరుకు రూ.1,300, రీ కౌంటింగ్‌కి (ప్రతీ పేపర్‌కి రూ.260) చెల్లించాలి. వీటికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్‌ 18 నుంచి 24వ తేదీలోపు రుసుం చెల్లించాలి.

Updated Date - Apr 13 , 2024 | 12:33 AM