Share News

కొల్లేరులో అక్రమ చెరువు గట్ల ధ్వంసం

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:26 AM

కొల్లేరు అభయారణ్యంలోని కైకలూరు మండలం పల్లెవాడలో అక్రమంగా తవ్విన చేపల చెరువు గట్లను బుధవారం అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు.

కొల్లేరులో అక్రమ చెరువు గట్ల ధ్వంసం
అక్రమ చెరువు గట్ల ధ్వంసం చేస్తున్న దృశ్యం

కైకలూరు, జూన్‌ 26 : కొల్లేరు అభయారణ్యంలోని కైకలూరు మండలం పల్లెవాడలో అక్రమంగా తవ్విన చేపల చెరువు గట్లను బుధవారం అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. రెండు రోజులుగా కొల్లేరు అభయారణ్యంలో గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో ఎక్స్‌కవేటర్లతో జువ్వకనుముల కాల్వ గట్టును ఆక్రమించుకొని యథేచ్ఛగా తవ్వకాలను చేపట్టారు. 10.46 ఎకరాలు చెరువును అక్ర మార్కులు అడ్డగోలుగా తవ్వేశారు. రెండు రోజులుగా తవ్వకాలు జరుగుతున్నా అటవీ అధి కారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు అటవీశాఖ డిప్యూటీ రేంజర్‌ జయప్రకాష్‌ ఆధ్వర్యంలో గట్లను ధ్వంసం చేశారు. అయితే పూర్తిస్థాయిలో గట్లను ధ్వంసం చేయకుండా నామమాత్రంగా ఽధ్వంసం చేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Updated Date - Jun 27 , 2024 | 12:26 AM