శిక్షణ ఎంతో ముఖ్యం
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:34 AM
శాంతి భద్రతలకు విఘా తం కలిగినప్పుడు వాటిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీ డ్రిల్, వెపన్ డ్రిల్, మాబ్ డ్రిల్ ఎంతో ముఖ్యమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు.

ఐజీ జీవీజీ అశోక్‌కుమార్
ఏలూరు క్రైం, మార్చి 5 : శాంతి భద్రతలకు విఘా తం కలిగినప్పుడు వాటిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీ డ్రిల్, వెపన్ డ్రిల్, మాబ్ డ్రిల్ ఎంతో ముఖ్యమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ఆర్ముడు రిజర్వు విభాగాల కవాత్‌లను, డ్రిల్‌ను, పోలీసు జాగిలాల మార్చ్‌ఫాస్ట్‌ను పరిశీ లించారు. ఐజీకి ఎస్పీ మేరీ ప్రశాంతి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనంలో పోలీస్ పెరేడ్‌ను ఆయన పరిశీలించి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీ ఎంల ఎస్కార్ట్, ముద్దాయిల ఎస్కార్ట్, లాంగ్ ఎస్కార్ట్‌లలో సిబ్బంది అప్రమత్తంగా విధులను నిర్వర్తించాలన్నారు. వివిధ విభాగాల పనితీరు పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఎస్పీ స్వరూపరాణి, ఏఆర్ ఏఎస్పీ ఎస్‌ఎస్ శేఖర్, ఎస్‌బీ సీఐలు మల్లేశ్వరరావు, ఆది ప్రసాద్, ఏఆర్ డీస్పీ చంద్ర శేఖర్, డీసీఆర్బీ సీఐ సుబ్బారావు పలువురు పాల్గొన్నారు.