Share News

ఇల్లు కట్టేద్దాం !

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:54 PM

ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ఇవి మంచిరోజులే.. సిమెంటు, ఐరెన్‌ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి.

ఇల్లు కట్టేద్దాం !

తగ్గిన సిమెంటు.. ఐరన్‌ ధరలు

అయినా నిర్మాణ రంగం డల్‌

రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడమే కారణం

తాడేపల్లిగూడెం రూరల్‌, ఫిబ్రవరి 7 : ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ఇవి మంచిరోజులే.. సిమెంటు, ఐరెన్‌ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే నిర్మాణాలు పుంజుకోవాల్సింది పోయి రోజురోజుకు తగ్గుతు న్నాయి. దీనికి కారణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆశాజనకంగా లేకపోవడం, నిర్మాణ రంగంలో ఊతం లేకపోవడమే.సాధారణంగా నిర్మాణాలకు డిసెంబర్‌ నుంచి జూన్‌ నెలల్లో అనుకూలంగా ఉండేకాలం. ఈ సమయంలోనే భవణ నిర్మాణాలకు కీలకంగా ఉండే సిమెంట్‌, ఐరన్‌ ధరలను పెంచుతారు. కానీ నిర్మాణాలు పెద్దగా లేకపోవడంతో ధరలు పెంచితే ఉన్న కొద్దిపాటి నిర్మా ణాలు కూడా ఆగిపోయి కర్మాగారాల నిర్వహణకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి.

సిమెంటు ధర దిగువకు..

గతంలో ఎన్నడూ లేనివిధంగా సిమెంటు ధరలు గరిష్టస్థాయిలో దిగువకు చేరాయి. ప్రస్తుతం సిమెంటు ధరలు రూ.270 నుంచి రూ.310 వరకూ మార్కెట్‌లో విక్రయాలు సాగుతున్నాయి. బ్రాండు, గ్రేడ్‌ తదితర వ్యత్యా సాలతో వీటి ధరలు నిర్ణయిస్తారు. గతేడాది నవంబర్‌లో ఈ ధరలు రూ.370 వరకూ విక్రయుంచారు. గతేడాది నవంబర్‌లో గరిష్టంగా రూ.370 విక్రయిం చిన ధరలు తెలంగాణ ఎన్నికల ఎఫెక్టుతో కొంత మేర తగ్గగా తరువాత నిర్మాణాలు పుంజుకుంటే ధరలు పెంచవచ్చని భావించిన కంపెనీలకు నిర్మాణ రంగం షాక్‌ ఇచ్చింది. దీంతో ధరలు మరింత కనిష్ట స్థాయికి పడిపోయాయి.

ఐరెన్‌దీ అదే బాట

గతేడాదిలో టన్ను ఐరెన్‌ ధర గరిష్టంగా రూ.70 వేలు పైగా పలకగా ఈ ఏడాది ఆ ఽధరలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఐరన్‌ టన్ను ధర రూ.57 వేల నుంచి 60 వేల వరకూ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇదే కనిష్ట ధర అని నిర్థారణకు వచ్చిన వ్యాపారులు రెండు నెలల క్రితం టన్ను రూ.62 వేలు పలికిన సందర్బంలో టన్నుల కొద్దీ ఐరెన్‌ స్టాకు పెట్టిన చాలామంది టన్నుకు రూ.3 వేల వరకూ చేతులు కాల్చుకున్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసే సాహసం చేయడం లేదు. ఈ పరిస్థితి సామాన్యులకు కొంత ఊరటే

ఊగిసలాడుతున్న ఇసుక ధర

గతంలో ఇసుక ధర నిలకడగానే ఉండేది. కానీ ప్రభుత్వం చేస్తున్న మార్పులతో ఇసుక ధర ఊగిసలాడుతోంది. నెల క్రితం మూడు యూనిట్‌ల ఇసుక లారీ రూ.12 వేల వరకూ విక్రయించారు. వారం క్రితం వరకూ అదే ధర కొనసాగినా ప్రస్తుతం ధర తగ్గింది. ఇసుక ర్యాంపులను ప్రైవేటు వ్యక్తు లకు అప్పగించడంతో వాటిపై ప్రభుత్వ నియంత్రణ లేక వినియోగ దారులు విలవిల్లాడుతున్నారు. వీటికితోడు బాటచార్జీల పేరుతో కొత్తరకం బాదుడు మొదలెట్టడం మరింత ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇసుక ధరలకు నిలకడ లేదు.

Updated Date - Feb 07 , 2024 | 11:55 PM