Share News

నరకమే..!

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:28 AM

ఏలూరులో ఉన్న జిల్లా ప్రభుత్వాస్పత్రిని మెడికల్‌ కాలేజీ టీచింగ్‌ ఆస్పత్రిగా మార్పు చేశారు. గతేడాది ఏప్రిల్‌ 26వ తేదీన మెడికల్‌ కాలేజీకి అనుమతులు వచ్చాయి. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా తీర్చి దిద్దారు.

నరకమే..!
ఎంసీహెచ్‌ భవనంలో గర్భిణులకు సహాయకారులుగా వచ్చిన వారి అవస్థలు

పేరుకే టీచింగ్‌ ఆస్పత్రి.. సౌకర్యాలు శూన్యం

ఎంసీహెచ్‌ బ్లాక్‌లో రోగి సహాయకుల పాట్లు

దారి మార్గంలోనే నేలపై పడిగాపులు

బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు, మంచినీళ్లూ కరువే.. పట్టించుకునే వారే లేరు

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 13 : ఏలూరులో ఉన్న జిల్లా ప్రభుత్వాస్పత్రిని మెడికల్‌ కాలేజీ టీచింగ్‌ ఆస్పత్రిగా మార్పు చేశారు. గతేడాది ఏప్రిల్‌ 26వ తేదీన మెడికల్‌ కాలేజీకి అనుమతులు వచ్చాయి. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా తీర్చి దిద్దారు. కానీ అప్పటి వరకూ ఉన్న సౌకర్యాలను పూర్తిగా తొలగించారు. పేరుకే మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి గా ఉంది. సదుపాయాలు ఏమి లేకపోవడంతో గర్భిణు లకు, రోగులకు సహాయ కారులుగా వచ్చినవారు ఇక్క నరకం చూడాల్సి వస్తోంది. ఆస్పత్రిలోని తల్లి బిడ్డల వైద్యసేవల విభాగంలో కాన్పులు చేస్తుంటారు. ఇక్కడ గర్భిణులకు తోడుగా వచ్చినవారు నరకం చూడాల్సిం దే. కూర్చోవడానికి ఒక బెంచీ ఉండదు. లోపలికి వెళ్ళే దారిలోనే వీరు నేలపై కూర్చుని తమ వస్తువులతో అక్కడే గంటల తరబడి, రోజులు తరబడి ఉండాల్సి వస్తోంది. తమ పేషెంట్లు డిశ్చార్జి అయ్యే వరకూ ఇదే పరిస్థితి. కనీసం ఒక్క ఫ్యాను లేదు. అసలే వేసవి కావడంతో రోగులకు సహాయ కారులుగా వచ్చేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వెయిటింగ్‌ హాలు కూడా ఏర్పాటు చేయలేదు. కుర్చీలు, బెంచీలు, ఫ్యాన్లు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవేమి అక్కడ లేనేలేవు. పేరుకే టీచింగ్‌ ఆస్ప త్రిగా ఉంది. సౌకర్యాలు మాత్రం శూన్యం. ఇప్పటికైనా తక్షణం జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడ పరిస్థి తులపై విచారణ జరిపి సదుపాయాలు కల్పించాలని పలు వురు రోగుల బంధువులు కోరుతున్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:29 AM