హైవే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:32 PM
జిల్లాలో కొనసాగుతున్న ఎన్.హెచ్ ప్రాజెక్టుల పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి అధికారులను ఆదేశించారు.

భీమవరం టౌన్, జూలై 5 : జిల్లాలో కొనసాగుతున్న ఎన్.హెచ్ ప్రాజెక్టుల పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి అధికారులను ఆదేశించారు. ఎన్ హెచ్–165. ఎన్ హెచ్–216 ప్రాజెక్టులపై సమీక్షించారు. పామర్రు నుంచి ఆకువీడు మీదుగా దిగమర్రు వరకు ఎన్‌హెచ్ 165 నిర్మాణం 104కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు. పామర్రు నుంచి ఆకివీడు వరకు 64కిలోమీటర్ల పరిధిలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఆకివీడు నుండి భీమవరం మీదగా దిగమర్రు చేరుకునే 40 కిలోమీటర్ల రహదారిలో 17కిలో మీటర్ల పరిధిలో పనులు చేపట్టాల్సిందన్నారు. ఇందు కొరకు భీమవరం బైపా స్ ప్రాంతంలోని ఆరు కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ పనులను వేగవంతం చేయాలని భీమవరం ఆర్డీవోకు జిల్లా కలెక్టర్ సూచించారు. అలాగే కత్తిపూడి నుండి ఒంగోలు ఎన్ హెచ్–216 నరసాపురం దిగమర్రు మీదగా లోసరి కలుపుతూ వెళ్లే మార్గం మధ్యలో మొగల్తూరు మండలం కాళీపట్నం వద్ద నేషనల్ హైవే ప్రాంతంలో సీపీజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి కొన్ని సమస్యలను అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.