Share News

మహిళలే అధికం

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:54 PM

నరసాపురం పార్లమెం ట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజ కవర్గాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా వున్నారు.

మహిళలే అధికం

భీమవరం అత్యధికం.. నరసాపురం అత్యల్పం.. తుది ఓటర్ల జాబితా విడుదల

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 28 : వచ్చే నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల తుది ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. నరసాపురం పార్లమెం ట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజ కవర్గాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా వున్నారు. మొత్తం 14 లక్షల 72 వేల 923 మంది ఓటర్లకు గాను, ఏడు లక్షల 21 వేల 532 మంది పురుషులు, ఏడు లక్షల 51 వేల 313 మంది మహిళలు, 78 మంది థర్డ్‌ జండర్స్‌ ఉన్నారు. వీరిలో సీనియర్‌ సిటిజన్స్‌ ఏడు వేల 803 మంది, యువ ఓటర్లు 38,188 మంది ఉన్నారు. రెండు లక్షల ఓటర్లు దాటిన నియోజకవర్గాలు నాలుగు. అవి భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం. నియోజకవర్గాల వారీగా..

ఆచంటలో పురుషులకంటే మహిళా ఓటర్లు 2,251 మంది అధికం. మొత్తం లక్షా 80 వేల 17 మంది ఓటర్లకు పురుషులు 88,881 మంది మహిళలు 91,132 మంది, థర్డ్‌ జండర్స్‌ నలుగురు. వీరిలో సీనియర్‌ సిటిజన్స్‌ 955, యువ ఓటర్లు 4,805 మంది ఉన్నారు.

పాలకొల్లులోను మహిళా ఓటర్లు మూడు వేల 567 మంది అధికం. మొత్తం లక్ష 95 వేల 57 మంది ఓటర్లకు గాను, పురుషులు 95,742 మంది, మహిళలు 99,309 మంది, థర్డ్‌ జండర్స్‌ ఆరుగురు. వీరిలో 1,118 మంది సీనియర్‌ సిటి జన్స్‌, 5,146 మంది యువ ఓటర్లు ఉన్నారు.

నరసాపురంలోను మహిళా ఓటర్లే 1,114 మంది అధికంగా ఉన్నారు. మొత్తం 1,70,448 మంది ఓటర్లకు గాను 84,667 మంది పురుష ఓటర్లు, 85,781 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో సీనియర్స్‌ సిటిజన్స్‌ 846 మంది, యువ ఓటర్లు 4,376 మంది ఉన్నారు.

జిల్లాలోనే ప్రతిష్టాత్మక ఎన్నికగా భావించే భీమవరంలో అభ్యర్థుల భవితవ్యం తేల్చేది మహిళా ఓటర్లే. ఇక్కడ వీరే 7 వేల 485 మంది అధికంగా వున్నారు. రెండు లక్షల 53 వేల 116 మంది ఓటర్లకు గాను, లక్షా 22 వేల790 మంది పురుషులు, లక్షా 30 వేల 275 మంది మహిళలు, 51 మంది థర్డ్‌ జండర్‌ ఓటర్లు ఉన్నారు. వీరిలో సీనియర్‌ సిటిజన్స్‌ 1,285 మంది, యువ ఓటర్లు 6 వేల 328 మంది ఉన్నారు.

ఉండిలోను మహిళా ఓటర్లు నాలుగు వేల 431 మంది అధికంగా ఉన్నారు. మొత్తం రెండు లక్షల 24 వేల 725 మంది ఓటర్లకు గాను, లక్షా పది వేల 146 మంది పురుషులు, లక్షా 14వేల 577 మంది మహిళా ఓటర్లు, ఇద్దరు థర్డ్‌ జండర్స్‌ ఉన్నారు. వీరిలో 1,333 మంది సీనియర్‌ సిటిజన్స్‌, 5,846 మంది యువ ఓటర్లు ఉన్నారు.

భీమవరం తర్వాత అత్యధికంగా మహిళా ఓటర్లున్న నియోజకవర్గం తణుకు. ఇక్కడ ఐదు వేల 700 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రెండు లక్షల 34 వేల 575 మంది ఓటర్లు ఉండగా, పురుషులు లక్షా 14 వేల 435 మంది, మహిళలు లక్షా 20 వేల 135 మంది, థర్డ్‌ జండర్స్‌ ఐదుగురు ఉన్నారు. వీరిలో 1,158 మంది సీనియర్‌ సిటిజన్స్‌, 6,033 మంది యువ ఓటర్లు ఉన్నారు.

తాడేపల్లిగూడెంలోనూ ఐదు వేల 233 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రెండు లక్షల 14 వేల 985 మంది ఓటర్లకు గాను, లక్షా నాలుగు వేల 871 మంది పురుషులు, లక్షా పది వేల 104 మంది మహిళలు, పది మంది థర్డ్‌ జండర్స్‌ ఉన్నారు. వీరిలో 1,108 మంది సీనియర్స్‌ సిటిజన్స్‌ ఉండగా ఐదు వేల 654 మంది యువ ఓటర్లు ఉన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:54 PM