Share News

ఎండ ప్రచండం

ABN , Publish Date - May 30 , 2024 | 11:58 PM

రోహిణి కార్తె ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. రోహిణి కార్తెలో సాధారణంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత పరిపాటి.

ఎండ ప్రచండం
నిత్యం రద్దీగా ఉండే బస్‌స్టేషన్‌–ఫైర్‌స్టేషన్‌ రోడ్డు ఇలా..

ఉక్కపోత.. వేడి గాలులలో ఉక్కిరిబిక్కిరి

ఏలూరు సిటీ, మే 30: రోహిణి కార్తె ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. రోహిణి కార్తెలో సాధారణంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత పరిపాటి. గురువారం జిల్లాలో 42 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైనా 47 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత మాదిరి ఉక్కపోత, వేడితో జనం విలవిల్లాడారు. జిల్లాలో ఉదయం 8గంటల నుంచే వడగాడ్పుల తీవ్రత కొనసాగింది. భానుడి చండ ప్రచండ ప్రతాపం, విపరీతమైన ఉక్కబోతతో ప్రజలు తల్లడిల్లిపోయారు. బయటకు రావడం ఎలా ఉన్నా ఇంట్లో ఉన్నా ఎండ తీవ్రతకు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం 11గంటలకే ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. రోహిణి కార్తెలో రోళ్లు బద్దలవుతాయనే నానుడి అందరికీ గుర్తు వచ్చింది. ఉపాధి, వ్యవసాయ కూలీలు, రోజు వారీ పనులు చేసుకునే కార్మికులు ఎండ తీవ్రత తట్టుకోలేకపోయారు, రిక్షా వాలా, ఆటో డ్రైవర్లు ఎండ తీవ్రతకు రోడ్డు పక్కన వాహనాలు నిలిపి సేదతీరారు. గతంలో ఈ స్థాయిలో ఎండ తీవ్రత లేదని పలువురు పేర్కొన్నారు. రాత్రి 7గంటలు దాటినా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగింది. ఎండ వేడిమిని తట్టుకోవటానికి ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయించారు.

Updated Date - May 30 , 2024 | 11:58 PM