మంట పుట్టిస్తోంది
ABN , Publish Date - Jun 18 , 2024 | 12:20 AM
భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. సోమవారం సూర్యుడు ప్రతాపం చూపించారు.
భానుడి ప్రతాపానికి జనం విలవిల
ఆచంట/పాలకొల్లు అర్బన్/ ఆకివీడు, జూన్ 17 : భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. సోమవారం సూర్యుడు ప్రతాపం చూపించారు. 40 డిగ్రీలకన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. మృగశిర కార్తె, గ్రీష్మ ఋతువు కావడంతో ఎండ వేడిమితోపాటు చెమటలతో ప్రజలు విలవిల్లాడిపోయారు. ఉదయం 10 గంటల నుంచి వేడిగాలులు వీయడంతో భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, ఆకివీడు ప్రాంతాల్లోని రహదారులన్నీ నిర్మాను ష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లల్లో నుంచి బైటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. ఎండ వేడి పెరగడంతోపాటు వడగాడ్పులు వీయడంతో బాటసారులు శీతల పానీయాల షాపుల వద్దకు పరుగులు తీశారు. సాయంత్రం ఐదు గంటలకు కొంత వేడి తగ్గడంతో ప్రజలు ఉపిరి పీల్చుకు న్నారు. ప్రతి రోజూ రాత్రి వేళల్లో మబ్బులు కనిపిస్తున్నప్పటికీ వర్షాలు పడటం లేదు. మరో రెండు–మూడు రోజులు ఇదే విధంగా ఉంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.