Share News

క్రమశిక్షణతో జూనియర్లు ముందుకు సాగాలి

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:13 AM

సీనియర్‌ న్యాయవాదులు అనుసరించిన క్రమశిక్షణ, సంప్రదాయాలను యువ న్యాయవాదులు పాటిస్తూ వృత్తిలో ముందుకు సాగాలని హైకోర్టు న్యాయమూర్తులు అన్నారు.

క్రమశిక్షణతో జూనియర్లు ముందుకు సాగాలి
చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులు

నరసాపురం, ఫిబ్రవరి 24: సీనియర్‌ న్యాయవాదులు అనుసరించిన క్రమశిక్షణ, సంప్రదాయాలను యువ న్యాయవాదులు పాటిస్తూ వృత్తిలో ముందుకు సాగాలని హైకోర్టు న్యాయమూర్తులు అన్నారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కోర్టు ప్రాంగణంలో స్వర్గీయ ఆందే బాపన్న చిత్రపటాన్ని హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి ఆకుల వెంకటశేషసాయి ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ నరసాపురం బార్‌ అసో సియేషన్‌కు ఎంతో చరిత్ర ఉందన్నారు. ఉద్దండులైన హైకోర్టు న్యాయ మూర్తులు, న్యాయవాదుల్ని అందించిన ఘనత ఈ కోర్టుకే దక్కిందన్నారు. సీనియర్‌ న్యాయవాదులు ఓపిక ఉన్నంత వరకు కోర్టుకు వచ్చి సేవలందించాలన్నారు. మరో న్యాయమూర్తి నైనాల జయసూర్య మాట్లాడుతూ న్యాయవాదులు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసినప్పుడే వృత్తిలో రాణిం చగలమన్నారు. మరో జడ్జి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ప్రజలకు న్యాయసలహాలను అందించడంలో న్యాయవాదులు ముందుండాల న్నారు. జస్టిస్‌ నూనేపల్లే హరినాధ్‌ మాట్లాడుతూ సీనియర్‌ న్యాయవాదుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని వృత్తిలో రాణించాలన్నారు. బార్‌ అసోసి యేషన్‌ అఽధ్యక్షుడు చల్లా దానయ్యనాయుడు సభకు అధ్యక్షత వహించారు. విశ్రాంతి హైకోర్టు న్యాయమూర్తి సోమయాజులు, జిల్లా న్యాయమూర్తి పురుషోత్తమ్‌కుమార్‌, ఏపీ బార్‌ ఆసోసియేషన్‌ సభ్యులు కృష్ణారెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు అర్‌కె బాబ్జీ, అడబాల స్వామినాయుడు, వెంకటాచార్యులు, జ్ఞానప్రకాష్‌, సూరిబాబు, రఘురాం, కృష్ణారావు, పురేళ్ళ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:13 AM